ఆరాటంకై పోరాటం
ఆరాటంకై పోరాటం
అంతులేని ఆశల విహంగం
మదిని తట్టే వాంఛలచిట్టా
రివ్వున వీచే వాయులీనం
అటు ఇటు కదిలే సాగర కెరటం
అడ్డు అదుపు లేని నీటి ప్రవాహం
తుల్లుతూ తిరిగే తూనీగ
రివ్వున వీచే మలయమారుతం
సుడిగాలి లాంటి జీవన వేగం
ఉదయించే భానుడిలా దిన దిన
ప్రవర్ధమానం ఈ జీవిత ఎదురీత
ఎందరో మరెందరో ఈ బతుకు
జీవన చిత్రాన్ని బంధాలు అనే
బందిఖానాను భారంగా ఈడుస్తూ
బతుకు పోరాటం చేస్తున్నారు ఆరాటంగా!.
