🌹 మాతృభూమి🌹
🌹 మాతృభూమి🌹
🌹 మాతృభూమి🌹
మలయమారుతపవనాలువీచేవేళ,
చిత్తడిచిరుజల్లులు కురిసేవేళ
మట్టి వాసన వెదజల్లుతూ,
మది పులకించినవేళ,
ఆ సమయాన నా మాతృభూమిపై కాలు మోపిన నేను పరవశంతో నామేను పులకించినవేళ ఉప్పొంగును నా మది
ఇదే ఇదే నా మాతృభూమియని !!
పిల్ల గాలులు తాకిడికి వరిపైరులు తలలూపుతూ నన్ను రారమ్మని, ఆహ్వానించుతూ,
మంజులమైన మధురగానం తో,
కోయిలమ్మకుహుకుహురాగాలతో,
వసంతఆగమన ఆహ్వానం పలుకుతూ,
నా మది ఉప్పొంగును ఇదే ఇదే నా మాతృభూమియని!!
నా దేశ స్వాతంత్రం ఎందరోవీరుల త్యాగఫలమని,
గాంధీ, నెహ్రు, పటేల్, లాల్ బహుదూర్, ఆంధ్రకేసరి, ఝాన్సీరాణి, రుద్రమల ఇంకా ఎందరో వీరుల శౌర్య పరాక్రమం నిండినదే నా భారతావని, అని పదేపదే తలచిన, ఉప్పొంగును నా మది,
ఇదే ఇదే నా మాతృభూమియని!!
నేను పుట్టి పెరిగిన పల్లెసీమ అంటే
ఎంతో ఎంతో అపురూపం నాకు
నేను కాలు మోపి తిరుగాడిన
నా మాతృభూమి వెదజల్లే
మట్టివాసనలు ఎప్పటికీ
మరువను నామాతృభూమిని
తాకిన నా మేనుపరవశించును మదినిమీటుభావాలతోమధురంగా
మాతృభూమికి వందనం 🙏🏽🙏🏽
🌹🌹🌹
