కవి,కలం
కవి,కలం
🌹కవి, కలం -కవిత 🌹
రచన :- అంజనీ గాయత్రి.
అతని చేతుల్లో ఆయుధం లేదు
ఉన్నదల్లా ఒకే ఒక్కటి అది కలం
ఆకలమే అతని ఆయుధం కాగా
ఆ కలంతో కాలాన్ని కరిగించే
కావ్యాలు ఎన్నో సృష్టించి
అందమైన కావ్య మాలికలు
అందరిహృదయాన్ని సాహిత్యసాగరంలో
ఆనంద పరవశంతో
మునిగితేలేలా చేయడమే
అతని కలానికున్న గొప్పతనమే
అనుకునేకంటే అతడి అంతరంగంలోనుంచి పొర్లుకొచ్చేఅద్భుతమైనఅమృతతుల్యమైన
భావపదజాలం అతనిచేతుల్లో నిక్షిప్తమై
అందరి అంతరంగాల్ని ఆకర్షించేలా చేసే
మహిమాన్వితశక్తి అతని చేతిలోఉన్న కలానికిఉంది,
అందరి అంతరంగాల్ని స్పృశించే
అద్భుతశక్తి కవిసొంతం,
అదే కవికున్న అసాధారణ ప్రతిభ,
అదే అతని అదృష్టం!
