అభిమానం
అభిమానం
అసలుసిసలు ధనమంటే..అభిమానం అంటాను..!
మృత్యువాత అనుభావన..అజ్ఞానం అంటాను..!
రాగాలకు అందనిదే..చెలిమోహన రాగమోయ్..
పాడేందుకు కుదరనిదే..హృదిగానం అంటాను..!
ప్రవహించే ప్రేమకన్న..ఘనమైనది ఏముంది..
విశ్వమునకు విందంటే..ప్రజ్ఞానం అంటాను..!
ప్రశ్నించే మనసుంటే..సమాధాన మొస్తుంది..
సహనానికి చోటిచ్చుట..నిజధ్యానం అంటాను..!
ప్రోత్సాహం కన్నగొప్ప..నవనీతం ఏదోయి..
నిత్యసత్య సాధనయే..అవధానం అంటాను..!
ఉల్లాసం నింపుశక్తి..ఉండుటయే సహృదయత..
చైతన్యం ఉన్నచోటె..వ్యవధానం అంటాను..
