ఏమన
ఏమన
మనసును దోచిన..చిలుకను ఏమన..!?
ఉలకని పలకని..జాణను ఏమన..!?
పున్నమి వెన్నెల..కురిసే కన్నుల..
నవ్వుల జాబిలి..వీణను ఏమన..!?
ఆశలు పెంచిన..సొగసరి కోమలి..
బంగరు మెఱుపుల..తీగను ఏమన..!?
గంధపు మడుగే..దాటగ తోడహొ..
సాక్షిగ ఉండే..నీడను ఏమన..!?
నాకథ నడిపే..నిరుపమ సుందరి..
గుండెను పిండే..బాధను ఏమన..!?
పెదివిని విప్పని..చక్కని సిగ్గరి..
వీడని మౌనపు..మొగ్గను ఏమన..!?
