STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

బాగుంది

బాగుంది

1 min
2


కనులార నినుచూస్తు..ఉండటం బాగుంది ..! 
నా నిదుర దోచి నువు..నవ్వటం బాగుంది..! 

నా మహా లోకమే..నీ తలపుగా మిగిలె.. 
నీ పిచ్చిలో నేను..మునగటం బాగుంది..! 

మాయంటె ఏమిటో..ఈ కనుల కేమెఱుక.. 
తనే నను కమ్మేస్తు..పాడటం బాగుంది..! 

ప్రాణాలు లాగేయు..గంధాల తోటలో.. 
ఈ శ్వాస తీగలను..పొదగటం బాగుంది..! 

నిజ చిత్రసీమగా..తోచదేం ఈ బ్రతుకు.. 
మనస్సాక్షిని నేను..మరవటం బాగుంది..! 

కవి'తనై ఈ నేను..గగనాలు దాటునా.. 
గొడుగైన మౌనమే..అలగటం బాగుంది..!


Rate this content
Log in

Similar telugu poem from Classics