ఆమెనవ్వు
ఆమెనవ్వు
లోకాలను రమ్యముగా..ఏలుతోంది ఆమెనవ్వు..!
విశ్వాలకు ప్రేమసుధను..నింపుతోంది ఆమెనవ్వు..!
'నేను' ఎవరొ చూపినదే..చూపకనే గమ్మత్తుగ..
నిత్యమౌన గీతాలలొ..ఒదుగుతోంది ఆమెనవ్వు..!
సకలభువన సామ్రాజ్ఞిని..ఓ బొమ్మగ చూపుటెలా..
చైతన్యపు రహస్యాలు..పంచుతోంది ఆమెనవ్వు..!
అజ్ఞానము కాల్చివేయు..అగ్నిపూల వర్షమదే..
అనుక్షణం వెలుగుదారి..చూపుతోంది ఆమెనవ్వు..!
ప్రతిహృదినో ఆలయముగ..చేసుకున్న జాణ తనే..
పసిడిపూల పుప్పొడిలో..చేరుతోంది ఆమెనవ్వు..!
స్వప్నాలను పండిస్తూ..ధన్యతనే ప్రసాదించు..
కరుణార్ద్ర రసాయనం..చిందుతోంది ఆమెనవ్వు..!
