ఉండీ పోయి
ఉండీ పోయి
భయపెట్టే పెనుచీకటి ఎప్పటికీ ఉండిపోదు
శశినికప్పు గ్రహణపీడ ఎన్నటికీ ఉండిపోదు
వయసులోన మగతనాన్ని చూపాలని యత్నించకు
గ్రీష్మరుతువు ఎండవేడి మాపటికీ ఉండిపోదు
కోపాలూ తాపాలూ క్షణకాలమె నిలుచునోయ్
మదిలొరగిలె ఉక్రోషం రేపటికీ ఉండిపోదు
కలలన్నీ నిజమైతే జీవితమే స్వర్గముకద
కన్నకలా కనులకప్పు రెప్పలకీ ఉండిపోదు
చాడీలను ఎన్నివిన్న ఇటువింటూ అటువదలెయ్
దరిజేరిన చెడ్డమాట కర్ణముకీ ఉండిపోదు
