గువ్వ
గువ్వ
రివ్వున ఎగిరే..గువ్వగ ఉన్నది..!
మనసే పొంగే..పాటగ ఉన్నది..!
నీవను నేనను..తేడా ఎఱుగదు..
కోకిల నిలచిన..కొమ్మగ ఉన్నది..!
పరువపు కోవెల..దీపము తానే..
బంగరు వెన్నెల..బొమ్మగ ఉన్నది..!
భావన సాక్షిగ..మౌనపు నిధియే..
వ్రాయని మాటల..తోటగ ఉన్నది..!
ప్రేయసి ఎవరో..చిక్కదు ఎంతకు..
కుంచెకు అందని..ఊహగ ఉన్నది..!
చెరగని తరగని..సోయగ రాశియె..
లేమిని దునిమే..తారగ ఉన్నది..!
