మనసు విప్పి
మనసు విప్పి
నీకుగాక ఇంకెవరికి..చెప్పాలిక మనసువిప్పి..!
నీకోసం గాక ఎలా..బ్రతకాలిక మనసువిప్పి..!
కలలోలా ఉన్నదోయి..ఈ కల'యిక ఎంతైనా..
కాలుతున్న చితిపైనే..కదలాలిక మనసువిప్పి..!
నిన్నుగాక ఎవ్వరినో..తలచుకోను పనేముంది..
సిగ్గుపూల తీగనెలా..చూపాలిక మనసువిప్పి..!
చిత్రహింస అనగలేను..కోరుకున్న జీవితమే..
ప్రేమలేఖ ఎవరికోయి..వ్రాయాలిక మనసువిప్పి..!
పరిహసించు ఒకనీడయె..తోడైనది గురువైనది..
విరహగగన వీధులలో..ఆడాలిక మనసువిప్పి..!
తేలిపోవు మాటలతో..పేచీపడి లాభమేమి..
ఒకచిక్కని చీకటినే..త్రాగాలిక మనసువిప్పి..!
