తనకు
తనకు
ఒకవాడని చిలిపితనం..ఆభరణము తనకు..!
బంగరు వెన్నెల గనియే..నిజవాసము తనకు..!
తిరుగులేని ఎదురుచూపు..కానుకగా ఇచ్చు..
మౌనవీణ రాగసుధయె..అనుపానము తనకు..!
వినోదించు ప్రక్రియలో..ముంచెత్తే జాణ..
ఈ విశ్వము అందమైన..చెలిమి వనము తనకు..!
గమనిస్తే శుభవసంత..మోహినియే తాను..
ప్రతి హృదయం దివ్యప్రేమ..కేదారము తనకు..!
అన్నింటా తానుంటూ..అంటకనే ఉండు..
కణకణమో అద్భుతమౌ..సంసారము తనకు..!
సత్యమేదొ తెలియజెప్పు..నిరుపమగురు రాణి..
ఈ జగాన ప్రతి రూపము..అపురూపము తనకు..!
