STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చెప్పనిమ్మ

చెప్పనిమ్మ

1 min
0



పెను చలిలో నిజకంబళి..నీ తలపని చెప్పనిమ్ము..! 
మాటవినని నీమనసే..నీ సఖుడని చెప్పనిమ్ము..! 

ఆరురుచుల తాండవమది..నీ నాలుక అంచుననే.. 
నట్టువాంగ మాగినంత..సౌఖ్యమ్మని చెప్పనిమ్ము..! 

ఆరుగుణాల వలలోనే..జన్మలెన్ని కడతేరెనొ.. 
అనుభవాల సాక్షికాగ..శాంతమ్మని చెప్పనిమ్ము..! 

నీవు-నేను ఆటలోన..గెలుపొందగ పోరాటం..
ఆరాటం రాలినంత..మోక్షమ్మని చెప్పనిమ్ము..! 

పల్లెతనం పచ్చదనం..గాక స్వర్గమెక్కడోయి.. 
విసుగులేని అమ్మతనం..దైవమ్మని చెప్పనిమ్ము..! 

పదవిపైన మోజు సరే..ప్రజాహితం మరచేవా.. 
నీతిని పాతరవేయుట..పాపమ్మని చెప్పనిమ్ము..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics