చూడగా
చూడగా
అలసటకు అలసటయె..రావాలి చూడగా..!
నిదురయే నిదురలో..మునగాలి చూడగా..!
పిలువగా పలకాలి..తలచగా వెలగాలి..
ఆలోచనా గాలి..ఆగాలి చూడగా..!
దీపాల తేఱంటి..దేహమే ఆలయం..
ప్రాణాల సాక్షిగా..కదలాలి చూడగా..!
కోపాలు తాపాలు..పాపాల కూపాలు..
కూలాలి మరగాలి..ఇగరాలి చూడగా..!
స్వర్గాలు నరకాలు..నిజసొంత లోకాలు..
పలు కలలు కోరికలు..రాలాలి చూడగా..!
ఉచ్ఛ్వాస నిశ్శ్వాస..లశ్వాలె తోడులే..
మౌనంపు కోవెలన..నిలవాలి చూడగా..!
