కధలోని జాబిలికి
కధలోని జాబిలికి
కథలోని జాబిలికి..అలుకేల వచ్చెనో..!?
విరహమది బహుమతిడ..మనసేల ఒప్పెనో..!?
నిదురయే రాకున్న..కలలేల కనగలను..
ఈ అగ్గి వానలో..నన్నేల నిలిపెనో..!?
ఏమేమొ తనతోటి..పంచుకో దలచితే..
దయతోడ ఈ తీపి..చితినేల పేర్చెనో..!?
నరనరములో మ్రోగు..నాదమే నారాణి..
మౌననది పాటగా..అసలేల మారెనో..!?
నిజవింత యాతనల..నా శ్వాస సాక్షియే..
నా కంటి ఊటలో..తడినేల దోచెనో..!?
ఒకలేఖ వ్రాయగా..కదలదే తలపింత..
మాటలే కరువైన..చోటేల చేర్చెనో..!?
