యెన్నెన్నో
యెన్నెన్నో
కన్నులలో వేదనలే యెన్నెన్నో మది కాయం గుండెల్లో గాయాలే యెన్నెన్నో వీరోచిత పోరాటం సూచించే కాలాలే ఓడిపోక యెదురు నిలువ సాహసాలె యెన్నెన్నో మీనాక్షీ కన్నులలో కురిపించే భావాలే అక్షరాల సాక్షిగాను వెల్లువయ్యె యెన్నెన్నో కన్నులనే సంద్రంలో సుడిగుండం మాటుననూ రెప్పమూయ కురిసేటీ అశ్రువులే యెన్నెన్నో పెదవిచాటు హృదయ వెతలు పలికించే విషాదాలు కనురెప్పల మాటుననే కనుపించే యెన్నెన్నో......
