ఆపగలమా.
ఆపగలమా.


ఆపగలమా...
ఇంకా ఉదయం పూర్తిగా విచ్చుకోలేదు
అమావాస్యకు చేరువయ్యే చంద్రుడు
మాత్రం ముడుచుకుని పోతున్నాడు
చలిగుప్పిటిలో ముడుచుకున్న నగరాన్ని
తెరిచే ప్రయత్నంలో ఉన్నట్టుంది రైల్వే స్టేషన్
పిట్టలన్నీ ఆకుల దుప్పటిలో చేరినట్టు
ప్రజలంతా పండుగ సందడిని
కప్పుకున్నారు
శాంతిసందేశంతో ప్రభువు వచ్చేవేళయిందని
గమ్యాలను చేరేందుకు తొందరపడుతున్నవారికి
పచ్చసిగ్నల్తో పలకరిస్తోంది రైల్వేస్టేషన్
కోలాహలపు చిరునామా కదా
కోయిలపాట కమ్మదనంతో స్వాగతంపలికే
స్వరాలవీణలా ఉషోదయాన్ని సవరిస్తోంది
మనుషులు మాటాడుకోరుకానీ
దృష్టిసారించే మనసులను ఎవరాపగలరు