ఆమె
ఆమె


గుండె లోతులోనుండి ఉబికి పైకి వస్తున్న ఆవేదనను!
ముని పంటి కింద అణిచి పెట్టి మౌనముగా బాధను!
లోలోపలే సహిస్తున్న ఆమె కనుపాపలు!
నడి సంధ్రములో మునిగి ఊపిరాడక!
ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైనములో!
కనురెప్ప వాల్చితే రాలే కన్నీటిని సైతం!
తనలో ఐక్యం చేసుకుంటున్న!
భూమాత,అతివ సహనము!
మీయిరువురికి సాటిరారెవ్వరు!