వరలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీ వ్రతం




బ్రిటిష్ పాలన మనదేశంలో ఉన్న రోజులు.
కాలేజీ విద్యార్థులు వరలక్ష్మీ వ్రతం శలవు కావాలని
లెక్చరర్ ని కోరారు.
ఆయన ప్రిన్సిపాల్ గారిని అడగందే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసారు.
ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపాల్ ని కలిసేందుకు వెళ్ళారు. ఆయన బ్రిటిషర్. ఆ సంవత్సరమే కాలేజీలో చార్జి తీసుకున్నారు. ఆయనను వారు వరలక్ష్మీ వ్రతం శలవు ఇవ్వమని కోరారు.
ఆయన అడిగి నప్పుడల్లా శలవు ఇవ్వడం కుదరదని చెప్తూ గత సంవత్సరం శలవు ఇచ్చినట్లైతే ఇవ్వగలమని చెప్పారు.
వెంటనే ఒక విద్యార్థి గత సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆదివారం అయినందున ప్రత్యేకంగా శలవు ప్రకటించ బడలేదని సమాధానం ఇచ్చాడు.
ఆ మాట విన్న ప్రిన్సిపాల్ గారు వెంటనే వరలక్ష్మీ వ్రతానికి శలవు ప్రకటించారు.