వంశీ సినిమా కథలుDINAKAR REDDY
వంశీ సినిమా కథలుDINAKAR REDDY


సూడి కుక్క ఎలా అరుస్తుందో తెలుసా.చిన్నారావుని అడిగితే తెలుస్తుంది.
అసలు రోజూ నిజ్జంగా నిజాలు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా.
మంచు పల్లకిలో సితార కోసం అన్వేషణ.
చెట్టు కింద ప్లీడరు ఎలా వాదిస్తాడో.రికార్డింగ్ డాన్స్ ట్రూపు.
పద్మినీ జాతి స్త్రీ.బట్టల సత్తి.
వంశీ సినిమా కథలు చాలా విచిత్రమైన అనుభూతిని ఇస్తాయి.క్యారెక్టర్లు రియాలిటీకి దగ్గరగా ఉన్నాయో లేవో అని ఆలోచించుకునే సమయం ఇవ్వవు.
కానీ చూసిన ప్రతి సారీ ఎక్కడో ఇలాంటి మనుషుల్ని చూశామే.మాట్లాడామే అని తప్పక అనిపిస్తుంది.
సగటు మనిషిలోని ఆశలు,భయాలు,సమాజంలోని రకరకాల స్వభావాల మనుషులు.వీటన్నిటికీ తోడు కామెడీ.
ఏమైనా పాత తెలుగు సినిమాలు చూస్తుంటే అసలు ఎవరన్నారు తెలుగు సినిమాల్లో క్రియేటివిటీ లేదని అని అనాలనిపిస్తుంది.