Dr.R.N.SHEELA KUMAR

Fantasy

3  

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

వలస

వలస

2 mins
256


పల్లెలో చదివి ఓ టీచర్ గ ఉద్యోగం చేసుకొనే సుజి కి సుబ్బు తో వివాహం అయి వేరే రాష్ట్రానికి వెళ్ళింది. పెద్ద కుటుంబం అందువలన ఉద్యోగానికి వెళ్ళేటందుకు అవకాశం లేని సుజి ఊరకనే కూర్చోవటం ఇష్టం లేక పై చదువులు చదివింది. కాలం పోకలో కుటుంబాలు వేరైనాయ్. సుజి మొదట ఓ చిన్న స్కూల్ లో పనిచేసేది. పనిచేస్తూ phd పూర్తి చేసిన తరవాత ఓ పెద్ద ప్రయివేట్ స్కూల్ లో హిందీ టీచర్ గా చేరింది.

అది పెద్ద స్కూల్ ముందుగానే అక్కడ ఓ 5గురు టీచర్లు వున్నారు. Phd అయిన ఖాళీలు లేనందున ఇప్పుడు మీకు ప్రైమరీ టీచర్ గా ఇస్తున్నాం హాయ్యర్ లో ఖాళీ వున్నపుడు మీకు ప్రమోషన్ ఇస్తాం అని చెప్పి కళ్ళల్లో వేడినీళ్లు ఒంపినట్లు గా ఆ ఉద్యోగాన్నిచ్చింది ఆ యాజమాన్యం. సుమీ కూడా కుటుంబ పరిస్థితుల వలన స్కూల్ నడిచి వెళ్లే దూరం కనుక ఒప్పుకుంది. తనకు తెలియదు ఆ ప్రైమరీ టీచర్ల కన్న తన జీతం ఎక్కువ అని మిగిలిన వాళ్ళు ఆఫీగినప్పుడు జీతం మొత్తం చెప్పేసింది అంతే తన కష్టాలు మొదలయ్యాయి. మిగిలిన టీచర్లు తనని యేనది శాంతంగా పని చెయ్యనివ్వలేదు దానికి తోడు స్కూల్ hm కూడా తనమీద కక్ష కట్టినట్లే ప్రవృటించేది. ఒక నోట్స్ ఇవ్వదు సిలబస్ ఇవ్వరు మిగిలిన టీచర్లు చెప్పిన తరవాతే నువ్వు క్లాస్ తియ్యాలి అందరికి 9పీరియడ్ లు అయితే సుమీ కి టైంటేబుల్ లో 4ఉంటాయి కానీ రోజుకి 10పీరియడ్ లు తను క్లాస్ కి వెళ్ళేది. ఏది ఏమైనా హిందీ hod కి తన మీద అభిమానం. ఎప్పుడు మిగిలిన టీచర్ల తో పొగుడుతూ చెపుతూనే వుంటారు. అది ఒక్కటేశుమి కి ఆనందం. రెండేళ్లయ్యాయి hod కి వేరే పెద్ద స్కూల్ లో ఉద్యోగం రావటం తో వెళ్లిపోయారు అంతే మళ్ళీ సుమీ కి కష్టాలు ప్రారంభం అయ్యాయి ఇక చేసేది లేక తన ఉద్యోగం రాజీనామా చేసింది తన అదృష్టమో, లేక సాయి ఆశీర్వాదమో ఓ పెద్ద కాలేజీ లో ఉద్యోగం దొరికింది. అందుకే అన్నారు కష్ట పడితే ఫలితం దక్కుతుంది అని 


Rate this content
Log in

Similar telugu story from Fantasy