ఉత్త(మ) రచయిత
ఉత్త(మ) రచయిత

1 min

60
ప్రతి సంవత్సరం మీరే ఉత్తమ రచయిత అవార్డు అందుకుంటున్నారు.
దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఇది.
వివేక్ అంటే ఒక గొప్ప నవలా రచయిత అని భావితరాల వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అని కమిటీ వాళ్ళ ఉద్దేశ్యం కాబోలు అని వివేక్ కమిటీ సభుల వైపు చూశాడు.
సభా స్థలి మొత్తం కరతాళ ధ్వనులతో మారు మ్రోగింది.
ముందు రోజు రాత్రి వివేక్ కమిటీ వాళ్ళకు గిఫ్టుగా ఇచ్చిన చెక్కు కమిటీ అధ్యక్షుని లోపలి జేబులో దాగి నవ్వుకుంది.