STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

3  

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

తార సితార

తార సితార

1 min
192

ఈమె ఓ రాజకుటుంబంలో పుట్టిన యువరాణి. కాలం తో పాటు మనము మారాలనే చిన్న విషయం కూడా తెలియని ఆ మార్తండ రాజు తన కుమార్తెను ఘోష పద్దతిలో పెంచి సహజ జీవనానికి దూరంగా పెంచాడు. ఓ రాకుమారిగా అన్నీ విద్యలు నేర్పిన బయట ప్రపంచంలో ఏమి జరుగుతుంది అనేది తెలియకుండా పెంచాడు. ఓ రోజు పగటి వేషదారుల బృందం కోటలో ఓ నాట్యం చేసేందుకు వచ్చారు. అందులో భరతుని వేషం వేసే వ్యక్తి రాము ని చుసిన సితార మనసు ఏదో తెలియని ఆరాటం పడుతుంది. అంత వరకు ఏ ఇతర పురుషుని చూడని సితార ఆకర్షణ కొ లోనైయ్యింది. ఇదే సమయంలో రాజుల కాలం అంతరించి ఆస్తులు కోటలు ప్రభుత్వం స్వాదీనం చేసింది. తండ్రి మరణం తో సితార ఒంటరిదయ్యింది. కోట నుండి బయటకు వచ్చింది.

 ఎవరికీ రాకుమారిగా పరిచయం అవ్వని సితార ఏదో పని చేసుకుంటూ, పొట్ట పోసుకుంటుంది. ఓ గారడీ వాళ్ళను చూసి ఆ పగటి వేశాగాళ్ళను గురించి అడిగి తెలుసుకొని రాము ని కలవటానికి అన్వేషణ ప్రారంభించి ఆఖరున రాము ని కలిసి తన ప్రేమను తెలిపింది. సితార కు రాము తనను కోటలో చూడలేదనే నమ్మకం కానీ రమ్ము ఈ కళ్ళను చూసి తను కోటలో చుసిన ఆ అమ్మాయి అని గుర్తు పెట్టి వివరాలను అడిగి, తనను పెళ్లి చేసుకునే ముందు నీకంటూ ఓ గుర్తింపు ఉండాలని చెపుతూ ఓ నాట్యకళాశాల ప్రారంభించి ఆ వచ్చిన డబ్బుతో తన కోటలో సగ భాగాన్ని కొనిపించాడు.. సితార కళ్ళలో తేజస్సు రాము కళ్ళలో ఆనందం ఒకేసారి అందరికి కనిపించాయి. ఇద్దరు కళ్యాణం చేసుకొని సుఖంగా ఆ కోటలోనే జీవితాన్ని గడిపారు. ఆఖరు వరకు తను ఈ కోట కి వారసురాలనే విషయం ఎవరికి తెలపలేదు. ఆస్తులు ఎన్ని ఉన్న మనసుకు నచ్చిన వ్యక్తితో ఉంటే అదే ఆనందం 


Rate this content
Log in

Similar telugu story from Fantasy