స్విమ్మింగ్ పూల్
స్విమ్మింగ్ పూల్
ఆకాష్ మరియు విశాల్ ఇద్దరు స్నేహితులు ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ చదువు ,ఆటలు అన్నింట్లోను ఆకాష్ ముందంజ లో ఉండేవాడు. దీంతో విశాల్ కి స్వార్దం , ద్వేషం , అసూయ
కలిగాయి . ఎలాగైనా నేనే గెలవాలి అనుకున్నాడు ,
ప్రయత్నించాడు సాధ్యపడలేదు విశాల్ కి స్వార్దం ,ద్వేషం , అసూయ తారాస్థాయి కి చేరుకున్నాయి ఇంకా విశాల్ ధ్యేయం ఒక్కటే ఆకాష్ నీ ఓడించడం అడ్డదారి లో గెలవాలి అనుకున్నాడు
అప్పుడే రాష్టస్థ్రాయి పోటీలు రాబోతున్న సమయం దీన్ని విశాల్ ఉపయోగించాలి అనుకున్నాడు . ఈసారి స్నేహితుడి ని దొంగదెబ్బ తీసి గెలవాలి అనుకున్నాడు దీనికోసం రాష్టస్థ్రాయి పోటీలను ఉపయోగించుకుని గెలవాలి అనుకుంటాడు . విశాల్ లక్ష్యం ఆకాష్ ఓటమి కానీ ఎలా గెలవాలి ఏమి చేయాలి అని ఆలోచించి ఒక
నిర్ణయానికి వస్తాడు
వారం రోజుల అనంతరం
మరికొద్ది సేపట్లో స్విమ్మింగ్ పోటీలు మొదలవుతాయి
ఆకాష్ , విశాల్ తో పాటు ఇంకొంత మంది స్విమ్మింగ్ పూల్ స్టార్టింగ్ దగ్గర వార్మప్ చేస్తూ ఉంటారు . ఇంతలో స్పీచ్ లు , అనౌస్మెంట్ లు
అవి , ఇవి అయ్యాక స్విమ్మింగ్ స్టార్ అవ్వడం అందరూ జంప్ చేయడం చేస్తారు అది మొత్తం ఒక 3Km పొడవు ఉంటుంది ఆకాష్ విశాల్ పక్క పక్కనే స్విమ్ చేస్తూ ఉంటారు .విశాల్ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
ఒక్కసారి గా ఆకాష్ వెనక్కి విశాల్ వెళ్ళి కాల
పట్టుకుని వెనక్కి నెట్టడం తో తల భూమి కి తాకుతుంది చేతులతో బ్యాలన్స్ చేసుకుని లేచి విశాల్ ప్రవర్తన కి అవ్వక్కవుతాడు ఆకాష్
ఇంకా తేరుకునే లోపే విశాల్ ముందుకు వెళ్లడం తనకి ఆసక్తి లేక అక్కడే ఉంటాడు
ఇంకా అందరినీ వెనక్కి నెట్టేసిన విశాల్ కే విజయం వరిస్తుంది

