raparthi anuradha

Horror Romance Thriller

4.5  

raparthi anuradha

Horror Romance Thriller

శక్తి ఆగమనం 1

శక్తి ఆగమనం 1

6 mins
306


*"" ఓం గం గణపతయే నమః

ఓం ఆనంద గణపతియే నమః

ఓం మహా గణపతియే నమః


****

ఫస్ట్ టైం ఈ స్టోరీ రాస్తున్న

ఇది హారర్ అని పూర్తిగా చెప్పలేను  

పాంటసీ ఇంకా లవ్ ఎమోషన్స్ తో

కూడుకుని ఉంటుంది.

మీకు నచ్చుతుంది అనే

అనుకుని ధైర్యం చేసి రాస్తున్న

నన్ను ఆదరిస్తారు

అనే నమ్మకం నాకు ఉంది...

ఇంక కధలోకి వెళుతున్న..!

*"""

*" నింగి లో చుక్కలు వరుసలు

కట్టి వజ్రపు కాంతుల వలే మెరుస్తూ.... పూ మాల లా ఒక

చోట చేరి నేల వంక చూస్తూ కనిపిస్తున్నాయి ....

*""

అర్ధ రాత్రి సమయం

అవుతున్న

ఆకాశం లో చీకటి

కమ్ముకొలేదు

నీలి రంగు తెర వేసుకుని

ఆకాశం ఎదో దైవ

కార్యం కనులారా చూడాలి

అన్నట్టు ఎదురు చూస్తూ

ఉంది.....!

*""""

నిండు చంద్రుడు మబ్బుల

నడుమ దాగుని వెన్నెల కాంతి కిరణాలు ప్రసరిస్తూ...

శుభ ముహూర్త సమయానికి వెలుపలికి వచ్చి తీరుతా

అని పంతం బూని చాటుగా నేల వంక చూస్తూ ఉన్నాడు...!

*""""

*" తెల్లవారితే

 విజయ దశమి

ఆది పరాశక్తి అవతరించి

శిష్టరక్షణ దుష్టశిక్షణ

జరిపిన రోజు....

అంతటి పర్వదినాన

ఉద్భవిస్తున్న శక్తీ ఆగమనం

కొరకు ప్రకృతి తన కన్నుల

కునుకు పడనివ్వ కుండా

ఎంతో ఆతృత గా ఎదురు

చూస్తూ ఉంది

ఎందుకొసం

ఎవరి కోసం...???

*****

మానవ తప్పిదం తో

శాపానికి గురైన ప్రాంతం.

తొంబై తొమ్మిది ఏళ్లుగా

ఎడారి వలె మారి

గడ్డి పూచ కూడా మొలవనంత

నిర్ధయ ప్రాంతం గా 

మారిపోయిన 

ఓనాటి పచ్చని వనం

ఈనాటి నిప్పుల గుండం.

అక్కడి వారి బ్రతుకే ఓ నరకం

******నీటి చుక్క కరువైన జనం

  మలమలమాడి

పోతున్న ప్రాణం

చే చేతుల చేసిన పాపం తొలగించుకున

చేస్తున్న యజ్ఞం... ఓ

నిష్కల్మష ప్రాణ త్యాగానికి

ఫలితం ఈ శక్తి ఆగమనం..!!!

*"" రాత్రి పన్నెండు దాటింది ఉదయానే విజయ దశమి

వేడుకలు ఎంతో కోలాహలం గా జరగనున్నాయి

ఊరిలో వారంతా పండుగ నాటి సంబరాలు కొరకు ఎన్నో

ఏర్పాట్లు చేసుకుంటూ

ఉన్నారు

*""" పరాశక్తి ఆలయానికి

దగ్గరలో ఓ ఆడ మనిషి నొప్పులు పడుతూ ఉంటే

ఆ ఇంట్లో వాళ్ళు

కంగారుపడుతూ ఆ శక్తి నీ వేడుకుంటూ ఉన్నారు..!

*""ఇంటికి వచ్చిన

డాక్టర్ హాస్పటిల్ కి సిప్ట్ చేసే సమయం లేక

ఇంట్లోనే పురుడు పోస్తూ

ఉంది. 

అక్కడికి తొంబై తొమ్మిది

కిలోమీటర్ల దూరంలో ఇంకో ఆడమనిషి అదే విధం గా

పురిటి నొప్పులు పడుతూ

ఉంది ఆమె పరిస్తితి కూడా

కష్టం గా ఉంది

*""" రాజరాజేశ్వరీ దేవి ఆలయం కి దగ్గరలో ఉంటున్న ఆ కుటుంభం అంతా ఆ దేవి నే తలుచుకుంటూ బైట కూర్చుని ఉన్నారు.

*""

సరిగ్గా మహా శక్తి

అవతరించిన గడయల్లో

ఆ ఇరువు ఆడవాళ్ళు

ప్రసవించారు....

*"""కానీ ముందుగా ఓ

తల్లికి ఆడపిల్ల పుట్టింది...

*""ఆమె పుట్టిన

ఎనిమిది క్షణాలకి ఇంకో చోట

మగ బిడ్డ పుట్టాడు....!

*""

అంతే అప్పటివరకు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ప్రకృతి పులకరించి పోయింది.

పంచ భూతాలు

ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది అన్నట్టు

ఆనందించాయి

ఆ శిశువులను

 ఆశీర్వదించాయి.

*""విచిత్రం గా రెండు ప్రదేశాలు

వేరు కొన్ని కిలోమీటర్ల దూరం

వారి మధ్య ఉంది.

 *"" కానీ అక్కడి

వాతావరణం ఒకే

విధం గా ఉంది

అప్పటి వరకు ఆకాశం లో

మాలగా ఉన్న నక్షత్రాలు

ఒకేసారి నేలకి రాలినట్టు

ఆ మాల పుట్టిన బిడ్డలని అభినందించినట్టు

వర్షపు చినుకులు గా మారి

నేల చేరుకున్నాయి.

*""ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది

చంద్రుడు మబ్బుల్లో ఉన్నావాడు కాస్తా వెలుపలికి వచ్చి

ఆ పసి బిడ్డలని చూసి

హు నాకంటే తేజో వంతంగా ఉన్నారే

అని మురిసి పోతు ఉన్నాడు.

*"""వెన్నెల కాంతి ఇంకా అలాగే ఉంది అయినా వర్షం

కురుస్తుంది

ఆ రెండు కుటుంబాల

వారికి విషయం

తెలిసింది పుట్టిన

బిడ్డలు సామాన్యులు కాదు వారి మహర్జాతకం

ఆ వాతావరణ మే

చెప్తుంది ..

*"""తల్లి బిడ్డ క్షేమం అని

డాక్టర్స్

చెప్పి వెళ్లారు

ఉన్నట్టుండి వాన

ఎక్కువయింది.

*"" మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది ఆ శిశువుల జననం కోసం తొంబైతొమ్మిది ఏళ్లు ఎదురు చూసింది మంచి

ఆ శిశు జననం కాకుండా తొంబై తొమ్మిది ఏళ్లు

ఆపింది ఓ చెడు.

*""అందుకే పుట్టిన శిశువుల ఊపిరి ఆపాలి అని చూస్తుంది

ఓ దుష్ట శక్తి.

**""' అక్కడ అంతా సంతోషం

వరద లా ఆనందం

పొంగిపోతూ ఉంటే ఇంట్లో

వాళ్ళు ఒక విషయం

గమనించారు

పుట్టిన బిడ్డలు

కళ్ళు తెరిచే ఉన్నారు

కానీ ఏడవటం లేదు కదలటం లేదూ

అందుకే వాళ్ళు

భయ పడ్డారు

*"""ఇదేం చిత్రం డాక్టర్ ఎటువంటి సమస్య లేదు అని

చెప్పి వెళ్ళింది

బిడ్డ ఏడవటం లేదు కదలటం లేదూ....

ఏమై

ఉంటుంది అని ఇంట్లో

వాళ్లంతా కంగారు

పడిపోతూ ఉన్నారు.

బైటకు వెళ్ళడానికి

వీల్లేకుండా అప్పటి వరకు

శాంతం గా కురిసిన వాన

మరింత వుధృతం గా మారింది.

*"" అక్కడి వారు భయ పడిపోతూ ఎంతో వేదనగా కూర్చుని ఉన్నారు.

*""మరుసటి రోజు ఉదయం

ఆరు గంటల సమయం కావస్తుంది.....

అక్కడికి

దగ్గరలో ఉన్న ఆలయం లో

పూజలు నిర్వహిస్తున్నారు.

*""మంత్రోచ్చారణ జరుగుతూ

ఉంది

ఇంట్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు

రాత్రి మొదలైన వర్షం అప్పటి

వరకు కురుస్తూనే

ఉంది అప్పుడే కాస్త తగ్గు

ముఖం పట్టింది.

**""

కోవెల లో మంత్రాలు విని

ఇంట్లో వాళ్ళు పిల్లల్ని

గుడిలోకి తీసుకుని వెళ్లి

అమ్మ ఆశీర్వాదం తో

నుదుట కుంకుమ పెడితే

బిడ్డ లో చలనం వస్తుంది ఏడుస్తుంది ఏమో అప్పటికి

మార్పు రాకుంటే వర్షాన్ని లెక్క చేయకుండా తడుచుకుంటూనే

హాస్పటిల్ కి వెళ్దాం అని

పురిటి బిడ్డలని తీసుకుని

అమ్మ ఆశీర్వాదం కోసం

ఆలయం లో అడుగు పెట్టారు

బిడ్డ తండ్రులు..!

*""' అప్పటి వరకు ఆ పసికందు ల గొంతు పట్టి ఉంచిన

అదృశ్య శక్తి అక్కడితో

ఆగవలసి

వచ్చింది.

*""".....

ఒక్కసారిగా విచిత్రం జరిగింది ఆలయం లో

అడుగు పెట్టగానే పుట్టిన బిడ్డలు అదిరి పడ్డారు.

*"""అక్కడి పూజారి బిడ్డని అందుకుని అమ్మ దగ్గర పెట్టీ

అమే కుంకుమ అంటించె సరికి సరిగ్గా అప్పుడే అక్కడ ఎవరో

శంఖం పూరించారు...

మరో వైపు మంత్రాలు

చదువుతూ పండితులు

హోమం జరిపిస్తు ఉన్నారు.

పూజలు చేస్తూ అమ్మకి

కుంకుమ అర్చన చేస్తూ

ఉన్నారు.

అక్కడి శక్తి ఆశీర్వాదం

అందిస్తూ ఉంటే

ఆ పురిటి కందులు

స్పృహ లోకి వచ్చినట్టు

కెవ్వున ఎడ్చాయి....

ఆ బిడ్డల ఏడుపు వేద మంత్రం లా వినిపించింది అక్కడి వాళ్ళకి.

బిడ్డ తండ్రికి

ఆనందం అవదలు

దాటింది.

ఒక్కసారి గా అమ్మ

మహిమ అందరికీ

తెలిసేలా ఆ దృశ్యం

కనిపించింది.

అప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్న బిడ్డ

గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటే

అక్కడ ఉన్న వారందరి

కళ్ళు చెమ్మగిల్లాయి.

జై మాతా జై జై మాతా

అంటూ 

ఆదిపరాశక్తి ని

వేడుకుంటూ బిడ్డల్ని అందుకున్నారు...

అక్కడి పూజారి విషయం తెలుసుకుని దేవి ప్రతిమ ఉన్న రక్ష నీ ఆ పిల్లల మెడలో కట్టి

ఇద్దరికీ ఒకే మాట చెప్పారు

ఈ బిడ్డ వివాహం పూర్తి అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ

ఈ రక్ష బిడ్డ మెడలోనుంచి తియ్యకండి అలా తీస్తే

ప్రమాదం.

గుర్తుంచు కొండి.

అలా అని భయం కూడా పెట్టుకోకండి

నీ బిడ్డ విజయం కోసం పుట్టింది

అనుకున్నది సాధిస్తుంది అందులో సందేహం లేదు

గొప్ప జాతకం గలది

అని ఆశీర్వాదం ఇచ్చి

పంపారు.

ఆ పిల్లల్ని తీసుకుని

ఆనందం గా ఇల్లు

చేరుకున్నారు. పిల్లల తండ్రులు.

వాళ్ళు ఇల్లు చేరుకుని

విషయం అంతా చెప్పారు. ఒక్కసారిగా

పెద్ద పండుగ నెలకుంది ఆ కుటుంబాల్లో అంతా

పుట్టిన బిడ్డలకు పేర్లు పెట్టారు.

*""మగబిడ్డ పేరు సిద్ధార్థ... అని ఆడబిడ్డ పేరు ఇందిరా దేవి....

అని నామకరణం చేశారు .

*" ముందుగా సిద్ధార్థ

కుటుంభం కొరకు చెబుతాను

సిద్ధార్థ తండ్రి సాంబ శివరాం..

తల్లి ధక్ష్యాయిని...

వారికి సిద్ధార్థ మొదటి

సంతానం

పెళ్ళైన ఎనిమిది ఏళ్ల తరువాత వాళ్ళకి బాబు పుట్టాడు

సాంబ శివరాం కి అన్న తమ్ముళ్లు అంటూ ఎవరూ లేరు

తల్లి తండ్రి మనవలు లేరు

అంటూ ఎన్నో పూజలు వ్రతాలు యజ్ఞాలు చేయించారు

వాటి ఫలితమే ఈ బాబు అని అంతా

సంతోష పడుతూ

ఉన్నారు.

*""'ఇందిర తండ్రి ఫని బుషన్

తల్లి శారదాంబ వీళ్ళది

కూడా అదే సమస్య

సంతానం లేదు అని ఎన్నో నోములు వ్రతాలు పూజలు నిర్వహించారు

వాటి ఫలితమే

ఈ మహా లక్ష్మి

అనుకుంటూ ఉన్నారు

అనుకున్నట్టే

*"""

పుట్టిన బిడ్డలు జాతకం తో ఊహించని రీతిలో

ఆ రెండు కుటుంబాల వారు గొప్ప

ధనవంతులు అయ్యారు

చిన్న

గల్లీ లో నివాసం ఉండే వారు

మహా నగరానికి

చేరుకున్నారు

పారిశ్రామిక వేత్తలగా ఎదిగి

 కోట్లు సంపాదించుకున్నారు

సంగం లో పలుకుబడి రాజికీయ పలకరింపుతో

ఆ ఇరువురి జీవన విధానం మారిపోయింది.

ఊహించని విధంగా భూషణం శివరాం అపోజిట్ అయ్యారు

అటు వ్యాపారం లో ఇటు రాజకీయం లో ఒకరంటే

ఒకరికి శతృత్వం ఏర్పడింది.....

కాదు ఏర్పడేలా ఓ

అదృశ్య శక్తి చేస్తుంది.

అందుకు కారణం ఉంది.

వారికి తెలియ కుండానే ఎన్నో విధాలుగా వారు

శత్రువులు అయ్యారు

ఇంక వారి మధ్య

భందుత్వం ఏర్పడటానికి అవకాశమేలేదు.

ఉదాహరణగా ఒక్క మాట

*"""హైదరాబాద్ నగరం లో

ఎన్నో ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని గొప్ప

పొజిషన్ లో ఉన్న

ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికీ

ఉపయోగ పడుతుంది అన్న

గజం భూమి కూడా వదలరు

అంత మొండి గొడవలు మధ్యవర్తుల తగాదాలు

మరింత తార స్థాయికి

చేరుకుని తూర్పు

పడమర లా ఉన్నారు

ఈ శివరాం, ఇంకా భూషన్...!!

వారి సంతానం సిద్ధార్థ్

అదే అందరూ ముద్దుగా పిలుచుకునే సిద్దు.

ఇందిరా దేవి అదే ఇందు అని ముద్దుగా పిలుచుకునే అమే.

ఓకే కాలేజ్ లో జాయిన్ అవ్వబోతున్నరు

వారి పేరెంట్స్ పంతం తో

పోటీ పడి అక్కడి కాలేజ్ లో

జాయిన్ చేస్తున్నారు.

*""""

సిద్దు ఇందు ఒకర్ని ఒకరు

ఎప్పుడు ఎదుర్పడి చూసుకుంది

లేదు చూసుకోవాలి అనుకున్నది లేదు కానీ వారి తండ్రుల

తగాదా పుణ్యమా అని

అవతలి వారి అన్ని వివరాలు

వారికి తెలుసు.

అలాగే ఒకరికి ఒకరు దూరం గా ఉండాలి అనేది కూడా

తెలుసు.

లేదంటే సమస్యలు వస్తాయి

అని జాగర్తగా ఉండాలి అనుకుంటున్నారు

అలాగే ఒకరంటే ఒకరికి కోపం ఇంకా విసుగు

కలిగి

ఉన్నారు.

కానీ

వారి మధ్య దూరం తోలగే

సమయం రానుంద.

అందుకే ఇరువురు ఓకే

చోటుకు చేరుకున్నార.

 ఆ విషయం ఆ

ఇరువురికి తెలిసేది

ఎప్పటికీ. ముందు ముందు ఎం జరగనుంది

చూడాలి

*****

ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఇరువురు

ఒకటై ఒక్కటిగా ఊహించని

గమ్యం చేరుకుని

ఏళ్లనాటి శాపం తొలగించి

నేల తల్లి దాహం

తీర్చగలుగుతారా

అందుకోసం

శక్తి ఆగమనం తప్పని సరా...????

*"""

అసలు గతం లో ఎం జరిగింది ఆ శాపం ఎంటి ఎవరు పెట్టారు ఎవరికి పెట్టారు సిద్దు ఇందు లని

అడ్డుకుంటుంది

ఎవరు...???

ఇక ముందు ముందు

ఎం జరగ బోతుంధి

మంచిని కాపాడాలి

అనుకుంది ఎవరు..???

చెడుగా మంచికి అడ్డం

వస్తుంది ఎవరు...????

వీరి జీవితం లో ఎలాంటి

మార్పులు రాబోతున్నాయి

ఎలాంటి సంఘటనలు

నెలకొంటాయి....???

*"" కంటికి కనిపించని

అదృశ్య శక్తి వీరిని ఎలా

అడ్డుకుంటుంది.

మంచికి సహాయ పడే

శక్తి ఆగమనం

ఎలా వీళ్ళ దారి

మళ్ళిస్తుంది

అనేదే.

శక్తి ఆగమనం

 సీరియల్ సారసం.

*""" 


Rate this content
Log in

Similar telugu story from Horror