Dr.R.N.SHEELA KUMAR

Fantasy

3  

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

రక్తసంబంధం

రక్తసంబంధం

1 min
517


అది ఓ అందమైన చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు. రాదా, రమేష్. రాద కి మూడేళ్లు, రమేష్ కి సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు. రాధ ఎప్పుడు తమ్ముడిని ఆడిస్తుంది. అమ్మకి చాలా సంతోషం. రాధ కి విజయదశమి రోజు అక్షరాభ్యాసం చేయించాలని భర్త తో చెప్పింది. సరే అని పంతులుగారి దగ్గరికీ వెళ్లి అన్నీ సమాకుర్చుకున్నాడు గోపయ్య. విజయదశమి నాడు పంతులు గారు గాయత్రీ కోవెలలో శుక్రవారం 9గంటల సమయంలో రాధ కి బియ్యం లో ఓం రాయించి పాపను దీవించేరు. రాధ స్కూల్ కి వెళ్ళడానికి సంతోషం తో చిందులు వేస్తుంది. రోజుకి ఓకే ఇంగ్లీష్ పాట, తెలుగు పాట, ఇంటికి వచ్చిన వెంటనే రమేష్ దగ్గర కూర్చొని పాడుతూనే ఉండేది. ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతున్నారు. రాధ రెండో తరగతికి వచ్చినప్పుడు రమేష్ కి ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించారు. విజయదశమి రోజు స్కూల్ లో చేర్చారు. అక్క తమ్ముడు చెట్టా పట్టాలెసుకొని రోజు స్కూల్ కి వెళ్లేవారు.

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. రమేష్ ఎప్పుడు చదువుల్లోను, ఆటలోనూ ఫస్ట్ వచ్చేవాడు. తన స్నేహితులు నీ విజయానికి కారణమేమిటిరా అని అడిగితె మా అక్కయ్యే అనేవాడు అలానే రాధ చదువుల్లో ఎప్పుడు మొదటే ఉండేది తన స్నేహితులు నీ విజయానికి అని అడిగితె నా తమ్ముడు అని చెప్పేది. ఇలా ఒకరిని విడచి ఒకరు ఎప్పుడు వుండరు. ఇద్దరికీ మూడేళ్లు తేడా అయిన ఇద్దరు స్నేహితుల లాగ ఉండడం చూసి అందరు ముచ్చట పడేవారు.. అక్కకి ఓ పోలీస్ ఆఫీసర్ సంబంధం తెచ్చాడు నాన్న. అంటే రమేష్ కాలేజీ చదువులు పూర్తి చేసిన ఇంకా చిన్న పిల్లాడుల మా అక్క పోలీసోడిని పెళ్లిచేసుకుంటుందని ఒకటే గేంతులు. పెళ్లి అయ్యి అటరింటికి వెళ్ళేటప్పుడు బావతో రమేష్ ఇది మా అక్క కాదు మా ఇంటి ఇలవేల్పు, మా ప్రాణాలను మీ చేతులలో పెడుతున్నామని అప్పగించేడు అక్కని ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటూ సాగనంపేరు. ఇదే రక్త సంబంధం.


Rate this content
Log in

Similar telugu story from Fantasy