Dinakar Reddy

Comedy Drama

4  

Dinakar Reddy

Comedy Drama

రైలు పెట్టె

రైలు పెట్టె

2 mins
330


అసలు కొత్తగా పెళ్లయిన వాళ్ళతో ఇంత మంది జనం ఎందుకు? అంతా ఒట్టి యెచ్చుల పనులు. ఓ పెద్దాయన టిక్కెట్లు చెక్ చేయడానికి వచ్చిన ఆఫీసరు ముందే గట్టిగట్టిగా అరుస్తున్నాడు.


ఆయన బాధను వినీ విననట్టు ముందుకు వెళ్ళిపోయాడు ఆఫీసరు. అంటే ఇప్పుడు నేను ఆ పెళ్లి బ్యాచ్ గురించి చెప్తా అనుకుంటున్నారా?


మీరు తోటకూరలో కాలేశారు. మరి మాకు తోటకూర పప్పు ఇష్టం కాబట్టి నేను స్పెసిఫిగ్గా చెప్పా అన్నమాట.


మరి నేను నా ప్రయాణం గురించి చెప్పొద్దూ. 

చెన్నై ఎక్స్ప్రెస్ రైలు అహ్మదాబాద్ నుండి బయలుదేరింది.


మన తెలుగు వాళ్ళే బ్రహ్మకుమారీలు రాజస్థాన్ నుంచి వస్తున్నట్టున్నారు. కాసేపు మాట్లాడాను. 


అంతలో స్ట్రాబెర్రీలు వచ్చాయి ఒక స్టేషన్లో. అవి తింటూ కాసేపు పుస్తకం చదువుదాం అనుకుంటే ఆ పుస్తకం చదవబుద్ధి కాలేదు.


ఏదో ఓవర్ యాక్షన్ చెయ్యడానికి కాకపోతే ఈ ఇంగ్లీషు పుస్తకాలు కొని అవి చదువుతున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఎందుకు?


మంచిగా ఏ యద్దనపూడి నవలో కొనుక్కుని రైలు ప్రయాణంలో చదువుతుంటే అసలు ప్రయాణం చేసినట్లే ఉండదు కదా. ఇంకేం చేద్దామబ్బా. "స్వాతి" కూడా దొరకలేదు.


నిద్ర పోవడం మంచిదని నిద్రపోయాను. వడా పావ్ ఘుమఘుమలకి మెలకువ వచ్చింది. 


అమ్మా వాళ్లకి పర్సులు తీసుకున్నాను జైసల్మీర్ మార్కెట్లో.

మరి నేను ఇంటికి రావాలంటే జైసల్మీర్ నుండి అహ్మదాబాద్ వచ్చి అక్కడి నుండి కడపకి రావాలి. మళ్లీ ఓసారి లగేజీ చూసుకుని కాసేపు దిగి రైలు పెట్టెలో అటూ ఇటూ తిరిగి భోజనం పార్సిల్ తీసుకున్నాను.


తిని మళ్లీ నిద్ర కోసం ఎదురు చూశాను. అదేంటో రైలు ప్రయాణం అంటే నిద్రలో కూడా లగేజీ గుర్తుకు వస్తుంది. మధ్య మధ్యలో లేవడం. లగేజీ ఉందా లేదా అని చూసుకోవడం. ఇదే పని ఇక.


తెల్లారింది. బ్రష్ చేసుకుని రెడీ అయిపోయా. గుంతకల్ లో టిఫిన్ బాగుంటుంది కదా. పైగా ఎక్కువ సేపు ఆగుతుంది కూడాను. వేడి వేడి వడలు, పులుసన్నం తిని మళ్లీ రైలెక్కా.


ఇంకాసేపు ప్రయాణం. మా ఊరు వస్తుంది. వచ్చేటప్పుడు రైలు ని పొగుడుకోవడం. ఇంటి నుంచి మళ్లీ జాబుకి వెళ్ళేటప్పుడు బాగా తిట్టుకోవడం. ఇదే అలవాటు అయ్యింది.


రైలు ప్రయాణాలు చేస్తూ తిరిగేసాం గానీ అదేంటో ఆ రైలే లేకుంటే ఎంత కష్టం అయ్యేది.


ఇంత పెద్ద భారత దేశాన్ని చిన్న రైలు పెట్టెలో చూసెయ్యొచ్చు. ఎన్ని భాషలు. ఎన్నో అనుభవాలు.


ఇంక నేను ఇంటికి వెళ్ళాలబ్బా. మా స్టేషన్ వచ్చింది.



Rate this content
Log in

Similar telugu story from Comedy