పుట్టనేల వాడు గిట్టనేల?
పుట్టనేల వాడు గిట్టనేల?


శాంతి వెయ్యి దేవుళ్ళకు మొక్కు కొంటే కొడుకు పుట్టాడు
రఘు అని పేరుపెట్టారు
నాన్న తాశిల్దారుగాపనిచేస్తూ కొడుకు పెంపకం బాధ్యతలు తల్లి మీద పెట్టాడు
చదువు సంధ్యలు శాంతి శాంతంగా కొడుకు చేత చేయించి ప్రయోజకుణ్ణిచేసింది
తాశిల్దారుడ్యూటీలోతలమునకలైనతండ్రికొడుకు అవసరాలకు డబ్బు సర్దేవాడు
రఘు బి.టెక్ పూర్తిచేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా లక్షరూపాయలు సంపాదిస్తున్నాడు.మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ అమ్మా నాన్నా రఘు ని ఓ ఇంటి వాణ్ణి చేశారు
తాశిల్దారుగారుమరో రెండేళ్ల కు రిటైరవుతారుహైదరాబాద్ లో కాపురం పెట్టారు రఘు,సరళ
చుట్టపు చూపు గా అమ్మా నాన్నా రఘు ని చూసి వెళ్ళేవారు
హైదరాబాద్ లో ఇల్లు కొనాలని రఘు వాళ్ళ నాన్న ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకుని 70 లక్షలు తనపేరలోన్ తీసుకుని కోటిరూపాయల కు త్రిబెడ్
రూం కొన్నాడు
రిటైర్మెంట్ అయిన తర్వాత మేమూ ఇక్కడ కొచ్చేస్తాంలేరా! అంది తల్లి
టౌన్ లో మీకు ఏంతోస్తుంది? అత్తయ్యా! అని దీర్ఘాలు తీసింది కోడలు సరళ
రిటైర్మెంట్ అయిన తర్వాత మూడు నెలల కే తండ్రి గతించాడు
కర్మక్రతువులు తూతూమంత్రంగా నాలుగు రోజులు జరిపించి రఘు,సరళ వెంటనే వెళ్ళి పోయారు
శాంతమ్మ కు మనశ్శాంతి కరువైంది
ఫోన్లో పలకరింపు లే తప్ప హైదరాబాద్ రమ్మనలేదుతల్లిని
పదేళ్ళు ఒంటరిగానేగడిపింది
హైదరాబాద్ నాకు పడదని అందరితో సర్దుబాటు ధోరణితో చెప్పేది
ఒకానొక రోజు కొడుకు,కోడలు వచ్చి లంకంత ఇల్లు పదిలక్షలకమ్మి తల్లిని హైదరాబాద్ తీసుకెళ్ళారు
రెండు నెలలు గడిచాయి
అమ్మా! నాకు అమెరికా లో ఉద్యోగం వచ్చింది అని దీర్ఘాలు తీసి ఆమెను వృద్ధాశ్రమం లో చేర్చారు
శాంతమ్మ వృద్ధాశ్రమం లో ప్రశాంతంగా ఉంది
రఘు ఏనాడూ ఫోన్ చేసి మాట్లాడలేదు
మనవుడిని చూడాలని కోరిక
రఘు ఇచ్చిన ఫోన్ పలకడం లేదు
ఆరాత్రి నిద్రలో నే కన్ను మూసింది.దిండు కింద కవర్లో పదివేలు ! కర్మక్రతువులకని చీటీ కనిపించాయి
వృద్ధాశ్రమం సెక్రటరీ రఘు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి మూడోరోజు స్వయం గా దహనసంస్కారాలు పూర్తి చేశారు
ఆ మర్నాడు ఎవరో చెప్పారు. రఘు అమెరికా కెళ్ళనేలేదని.