పిక్నిక్
పిక్నిక్


నాకోసం మీరంతా ఎందుకురా ఆగిపోతామంటున్నారు అని అడిగా నేను.
సుధీర్! ఎలాగైనా సరే మనందరం కలిసి పిక్నిక్ వెళదాం రా.
మా ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు రా అన్నాన్నేను.
అయితే ఓ పని చేద్దాం అని రాహుల్ గాడూ శీను గాడూ మాట్లాడుకున్నారు.
మరుసటి రోజు చూద్దును కదా ఇద్దరూ లగేజీతో సహా మా ఇంట్లో దిగిపోయారు.
వాళ్ళని భరించలేక మా నాన్న నన్ను పిక్నిక్ పంపడమే మంచిదని నిర్ణయించుకున్నారు.
మా అమ్మ నాకు మా స్నేహితులకి కలిపి తినడానికి చాలా ఐటమ్స్ ప్యాక్ చేసింది.
అలా ఫస్ట్ పిక్నిక్ స్నేహితులతో చాలా సరదాగా గడిచింది.