నిశాంతి
నిశాంతి
అది ఓ నిశిరాత్రి. హాస్టల్ లో విద్యార్థులు ఒకరిని ఇంకొకరు చూస్తూ భయంగా నిలుచున్నారు. అప్పుడే సుబ్బమ్మ వార్డెన్ వెళ్ళండి మీ రూమ్ కి వెళ్లి చదువుకోండి తిన్నారుగా అన్నది. వెంటనే సుభాషిణి ఇంకా నిశాంతి తినలేదు మేడం అన్నది. వెంటనే డైనింగ్ హలుకు వెళ్లి నిశాంతిని తిట్టి పళ్లెన్ని విసిరేసింది. సుభాషిణి అదంతా వీడియో తీసి పెట్టింది. మరుసటి రోజు కాలేజీ లో ప్రిన్సిపాల్ కి ఆ వీడియో చూపించి 7.30 లోపు డిన్నర్ కి వెళ్లకపోతే ఇలానే చేస్తున్నారు మేడం అని పిర్యాదు చేసారు. వెంటనే ప్రిన్సిపాల్ తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేరు.
మరుసటి రోజు రాత్రి 12గంటలకు హాస్టల్ లో ఒకటే గొడవ అందరు ఏదో శబ్దం వినిపిస్తుంది అని. నిశాంతి ఏమీ లేదు అంత మీ భ్రమ అంటూ తిట్టింది తను మాత్రం తలుపులు వేసుకొని చదువు కుంటుంది. అప్పుడే ఫ్యాన్ ఆగి నీకు భయం లేదా అని ఓ ఆశరీర వాణి వినిపించింది.. అప్పుడు నిశాంతి ఎందుకు భయపడాలి నీకు నా అవసరం ఏదైనా ఉంటే చెప్పు చేసి పెడతాను అన్నది. అంతే మరే శబ్దం వినిపించలేదు.
మరుసటి రోజు నిశాంతి సాయిబాబా కోవెలలో పంతులుగారితో విషయం చెప్పింది. నీ ధైర్యం సాయి అనుగ్రహం తోడుగా అంత మంచే జరుగుతుంది అని ఆశీర్వదించారు.కాలేజీ లో అందరు ఒకటే ప్రశ్నలు హాస్టల్ లో దెయ్యాలు ఉన్నాయంట అని అందరు అవును శబ్దాలు వస్తున్నాయి అని చెప్పారు నిపుణ్ నిశాంతి దగ్గరకు వచ్చి ఏంటీ అందరు భయపడుతున్నారు నువ్వస్సలు పట్టించుకోవటం లేదు అని అడిగాడు. నిశాంతి దెయ్యంతో మాట్లాడెను, సహాయం చెయ్యాలా అని అడిగాను అని చెప్పింది. వెంటనే నవ్వాడు.
కొన్ని రోజుల తరవాత ఇదంతా హాస్టల్ వార్డెన్ చేస్తున్న పని అని నిపుణ్ కనిపెట్టి తగిన గుణపాఠం చెప్పాడు. దేనికైనా బయపడకూడదు అని నిశాంతి అందరితోనూ చెప్పింది.

