STORYMIRROR

Narra Pandu

Fantasy Inspirational Others

4  

Narra Pandu

Fantasy Inspirational Others

నాకోసం నువ్వు నీకోసం నేను

నాకోసం నువ్వు నీకోసం నేను

1 min
363

కవిత కోసం నా కవిత

కవిత.....

ఓ కవిత.....

నీకోసమే రాస్తున్న ఈ కవిత...

అందుకో అందమైన నా అక్షర పరిమళాల కవిత...

నీకోసమే నేను అయితే...

నానుండి పుట్టింది నువ్వు...

నాలోని అక్షరాలకు ప్రతిరూపం నువ్వు...

నాలోని ఆలోచనలకు ఊపిరి నువ్వు...

నాలోని భావాలకు అర్ధం నువ్వు...

నాలోని ప్రతిభకు గుర్తింపు నువ్వు...

నాలోని ప్రశాంతతకు కారణం నువ్వు...

నాలోని నిస్సహాయత నింపింది నువ్వు...

నాలోని నన్ను నలుగురికి తెలిసేలా చేసింది నువ్వు..

నాలోని కవిని పరిచయం చేసింది నువ్వు...

అయితే,

నాలోని అక్షరాలతో నన్ను ఆదరించినవారెందరో...

నాలోని ఆలోచనలతో నన్ను అర్ధం చేసుకున్నావారెందరో...

నాలోని భావాలకు నన్ను భాధపెట్టినవారెందరో...

నాలోని ప్రతిభకు ప్రతిక్షణం తోడున్నావారెందరో...

నాలోని ప్రశాంతతకు నాకు పరిచయమైనవారెందరో...

నాలోని కవిని కనువిప్పు చేసినవారెందరో...

అదంతా నీ వల్లే...

అందుకే ప్రతిక్షణం అందరికి నిన్ను కొత్తగా

పరిచయం చేస్తూ...

నాలోని ఆలోచనలకు ఆయుష్షు పోస్తూ...

నీకోసం రోజుకో కవిత రాస్తూ......

నీకోసం నేను...

నాకోసం నువ్వు....

ఒకరికి ఒకరం నువ్వు నేను...

అదే మనిద్దరి లవ్వు.



Rate this content
Log in

Similar telugu story from Fantasy