Kishore Semalla

Comedy Fantasy Inspirational

4.0  

Kishore Semalla

Comedy Fantasy Inspirational

'మాస్క్'

'మాస్క్'

4 mins
24.4K



                 ఉదయాన్నే లేచి జాగింగ్ చెయ్యడం శ్రీనివాస్ కి అలవాటు. వెళ్లే ముందు, "నాన్న! జాగింగ్ కి వెళ్ళొస్తా" అని చెప్పి బయల్దేరాడు. "నేనూ వస్తా తోడుగా" అని ఎవరో పిలిచినట్టు అనిపించింది. వినడానికి ఆ గొంతు చిన్నపిల్లాడిది లా అనిపించింది. వెనక్కి తిరిగి చూసాడు, కానీ అక్కడ ఎవరు లేరు. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేరు, ఎవరు పిలిచారు అబ్బా???? అని, సరే! నా భ్రమ ఏమో అనుకుని బయల్దేరాడు.

                 బాగా కసరత్తులు చేసి ఇంటికి చేరుకున్నాడు. వచ్చి రాగానే టీవీ పెట్టాడు శ్రీనివాస్.

                "ఈరోజు నుంచి లాక్డౌన్ కఠినంగా అమలుకాబోతుందని, ఎవరన్నా బయట తిరిగితే సహించేది లేదని" KCR గారు ఉత్తర్వులు జారీ చేశారు.

               'చచ్చిందిరా గొర్రె'! అనుకున్నాడు శ్రీనివాస్. ఐతే ఇక నా కసరత్తులు ఇంటికే పరిమితమా, ఛ! అనుకున్నాడు.

              

                 ఇంతలో అమ్మ పద్మావతి శ్రీనివాస్ చేతిలో నుంచి రిమోట్ లాక్కుంది. వార ఫలాలు వచ్చే టైం అయింది, నీ రాసి ఎలా వుందో చూద్దాం అని ఛానల్ మార్చింది.

       

                 అమ్మా, తల్లి నీకో దండం. నువ్వు వరఫలాలు చూడడం అందులో చెపినట్టు నా చేత చేయించడం, వద్దమ్మ వద్దు అనుకుని పారిపోయే ప్రయత్నం చేసాడు.

                ఎక్కడికి పరిపోతున్నావ్, ఆగు నీ రాసి గురించే చెప్తున్నారు. వినేసి వెళ్ళు అని చెయ్ పట్టి వెనక్కి లాగింది. మళ్ళీ సోఫా లో పడ్డాడు.

 

               వినేదాక వదలవు కదా! తప్పుతుందా, ఏం చెప్తాడో చూద్దాం. కానీ అందులో చెప్పినవన్నీ చేయమంటే మాత్రం నా వల్ల కాదు. పోయిన వారం ఎరుపు రంగు కలిసి వస్తుందని నా చేత ఎరుపు రంగు చొక్కా, నల్ల ప్యాంటు వేయించావ్. తీరా అవి వేసుకుని రోడ్ మీదకి వెళ్తే కుక్కలు నన్ను కాలేజ్ వరకు తరిమాయ్. ఏదో రోజు పరిగెడుతున్న పరుగు అక్కడ అలా ఉపయోగపడింది.

              సరే, సరే విను ఏం చెప్తున్నాడో చూద్దాం అని అమ్మ కలగజేసుకుంది.

              "ఈ రాసి వారికి శని దగ్గర గా ఉంది. ప్రమాదం దగ్గరకి వెళ్తారు. కానీ మీకు ఈరోజు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వారి వల్ల మీకు సహాయం చేకూరుతుంది. నలుపు రంగు కలిసి వస్తుంది" అని చెప్పారు పండితులు.

 

              బయటకి వెళ్ళేది లేదు, ప్రమాదం అంట కొత్త స్నేహితులు అంట అనుకుని నవ్వేసాడు శ్రీనివాస్. నేనున్నా కదా ఫ్రెండ్ అని మళ్ళీ పొద్దున్న విన్న అదే గొంతు వినిపించింది. కానీ చుట్టూ చూస్తే ఎవరు లేరు.

 

              అమ్మా! మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా వున్నారా? అని అడిగాడు శ్రీనివాస్. ముడ్డికిందకి పాతికేళ్ళ వచ్చిన ఒక బడుద్దాయి వున్నాడు లే అని వెటకారం చేసింది అమ్మ.

              కాదమ్మ, పొద్దునుంచి ఎవరో చిన్నపిల్లాడు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ చూస్తే ఎవరు కనిపించట్లేదు అని చెప్పాడు శ్రీనివాస్.

               అర్ధరాత్రులు ఇంగ్లీష్ సినిమాలు చూస్తే అలానే అనిపిస్తాది రా ఎదవ, ముందు మార్కెట్ కి వెళ్ళాలి బయల్దేరు. అసలే తొమ్మిది దాటితే మార్కెట్ కట్టేస్తారు అని నాన్న సుబ్బారావు పెరటిలో మొక్కలకు నీళ్లు పోస్తూ చెప్పాడు.

               మార్కెట్ కి వెళదాం అని బైక్ కీస్ తీసుకున్నాడు. ఇంతలో మళ్ళీ నేను వస్తా తోడుగా అని అదే గొంతు వినిపించింది.

               ఈసారి వెనక్కి తిరిగి చూసాడు. సరే తీసుకెళ్తా, ఎక్కడ నువ్వు అని అడిగాడు. "నేను ఇక్కడే వున్నా" అని సోఫా వెనుక నుంచి ఆ గొంతు వినిపించింది.

               వెళ్లి చూసాడు. అక్కడ ఎవరు లేరు. ఎక్కడ నువ్వు? అని మళ్ళీ అడిగాడు. ఇదిగో నీ ముందే ఉన్న అని ఎదురుగా ఉన్న బల్ల పైన మాస్క్ మాట్లాడడం గమనించాడు.

              ఆశ్చర్యంగా వుంది. మాస్క్ నాతో మాట్లాడడం ఏంటి? నేను ఇది నమ్మలేకపొతున్నాను. ఫ్రెండ్ నన్ను నీతో తీసుకు వెళ్ళు అని మాస్క్ మళ్ళీ అడిగింది.

  

             భలేగుంది, మాస్క్ తనతో మాట్లాడటం వింతగా అనిపించింది శ్రీనివాస్ కి. సరే పద అని మాస్క్ పెట్టుకున్నాడు. దారి పొడుగునా ఇంకా మాస్క్ మాట్లాడుతూనే వుంది.

   

             బయట అస్సలు పరిస్థితులు బాలేవు ఫ్రెండ్. కొన్ని డేస్ నాతో ఫ్రెండ్షిప్ చెయ్, నేనె నిన్ను కాపాడత అని చెప్పింది. శ్రీనివాస్ నవ్వుకున్నాడు.

             నవ్వకు ఫ్రెండ్, ఎంత మందికి చెప్పినా వినట్లేదు. నన్ను చాలా చులకనగా చూస్తున్నారు. నా అవసరం పోను పోను తెలుస్తుంది ఈ జనాలకి అని కబుర్లు అయ్యేలోపు మార్కెట్ వచ్చేసింది.

             ఫ్రెండ్ ఆగు!!!! వాడు అక్కడ దగ్గుతున్నాడు, అది చేతులు అడ్డం పెట్టకుండా, కొంచెం దూరం గా వుండు. వాడికి అసలు పరిశుభ్రత లేదు. మొన్న వాడికి చెప్పా, నాతో ఫ్రెండ్షిప్ చేయరా, నీకు సాయం చేస్తా అని. నన్ను విసిరికొట్టేసాడు, వాడికి దూరంగా వుండు అని సలహా ఇచ్చింది మాస్క్.

            సరే! అక్కడ నీ ఫ్రెండ్ అనుకుంటా, మాస్క్ పెట్టుకున్నాడు. పోనీ వాడి దగ్గర కొందామ అని అడిగాడు శ్రీనివాస్.

           ఒహ్హ్! బ్రహ్మాండంగా, వాడు నాకు డైలీ dettol వేసి మరి స్నానం చేయిస్తాడు. నన్ను బాగా చూసుకుంటాడు అని చాలా సంతోషం తో చెప్పింది మాస్క్.

       

           మార్కెట్ పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరాడు శ్రీనివాస్. ఇంట్లో అమ్మా, నాన్న ఇద్దరు కంగారు పడుతూ కనిపించారు.

            హమ్మయ్య! వచ్చేశావ, ఇప్పుడే వార్తల్లో చెప్పారు, "మార్కెట్ లో విస్తరించిన కరోనా వైరస్" అని. మొఖానికి ఉన్న మాస్క్ చూసి, మంచి పని చేశావ్ మాస్క్ పెట్టుకుని త్వరగా వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుని రా, టిఫిన్ చేసేవు అని అమ్మ చెప్పి దేవుడికి దండం పెట్టుకుంది.

             శ్రీనివాస్ కి పొద్దున్న రాశి ఫలాలు గుర్తు వచ్చాయి. కొత్త స్నేహితుడు మాస్క్, ప్రమాదం కరోనా.

              మాస్క్ కి థాంక్స్ చెప్పి, హ్యాండ్ వాష్ చేద్దాం అని వెళ్ళాడు. "హలో బ్రో, హౌ అర్ యు" అని హ్యాండ్ వాష్ మాస్క్ ని అడిగింది. మళ్ళీ ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్. మీకు ముందు నుంచి పరిచయం వుందా? అని అడిగాడు. మేమె కాదు ఇంకా సోప్, సానిటీజర్, బ్లీచింగ్ పౌడర్ ఇలా క్రిములని దాడి చేసే ఒక యుద్ధ సైన్యం మేము అని చెప్పింది మాస్క్.

              ఇదంతా కల, నిజమా నేను నమ్మలేకపొతున్నాను. చాలా ఆశ్చర్యంగా వుంది ఇదంతా అని కలవారిస్తుంటే నిద్దట్లో, పెల్లుమని నాన్న సుబ్బారావు ఒక్క తన్ను తన్నాడు. అంతే మంచం మీద నుంచి బోర్లా పడ్డాడు శ్రీనివాస్.

              తెల్లవార్లు నిద్దరపోవడం కాదు ఎదవ, బారెడు పొద్దు ఎక్కిన దున్నపోతులా పడుకున్నావ్. త్వరగా రెడీ అయ్యి బజారుకి వెళ్లు. తొమ్మిది దాటితే మార్కెట్ కట్టేస్తారు అని చెప్పి చేతిలో బ్యాగ్ పెట్టాడు.

              సరే లే, మంచి కల పాడుచేశావ్. ఆ బైక్ కీస్ అందుకో వెళ్తా అని లేచాడు. పక్కనే మాస్క్ వుంది. దాని వంక చూసాడు. మాస్క్ కన్ను కొట్టింది. నవ్వుకున్నాడు శ్రీనివాస్😊, మాస్క్ తీసుకున్నాడు. సానిటీజర్ చేతిలో వేసుకుని తుడుచుకున్నాడు. ఈసారి కల నాకు చాలా నేర్పించింది అనుకున్నాడు.

"మాస్క్ ధరించండి, కరోనా ని తరిమికొట్టండి"......

                     **********************

      


                



                



Rate this content
Log in

Similar telugu story from Comedy