జననం..జీవితం..మరణం..
జననం..జీవితం..మరణం..


జననం..జీవితం..మరణం..
జననం తెలియకుండా జరగడం...
జీవితం అంతా ఓ నాటకం...
మరణం తరువాత ఏమిటి ?
పూర్వ జన్మ, పునర్జన్మ, ఖర్మ,
ఆత్మ స్వర్గ నరకాలు, మత ధర్మ న్యాయాలు, మోక్షం...అనేవి ఏంటివి ?
మనిషి అనే జన్మ ఏమిటి?
సహజ సిద్ధంగా ప్రకృతిలో జరిగే పరిణామాలకు ఎటువంటి అతీత శక్తులకు చోటు లేదు.
కనిపించేవి వినిపించేవి జ్ఞానేంద్రియలకు తెలిసేవి మాత్రమే నిజం.
మిగిలిన దైవం, ఆత్మ, పునర్జన్మ, ఖర్మ అనేవి అబద్దం.
శూన్యం నుండి సృష్టి జరగటమనేది జరగని పని.
వస్తువు నుండి వస్తువు వస్తుంది కానీ శూన్యం నుండి రాదు.
ఆత్మ అంటే చైతన్యముతో కూడిన దేహం.
దేహాన్ని(పదార్థం)ను మించిన ఆత్మ ప్రత్యేకంగా విశ్వంలో ఎక్కడ ఉండదు. కాబట్టి ఆత్మ అనేది దేహం.
చైతన్య వంతమైన మానవ శరీరం అనే పదార్థం ఏర్పడటం వలన మరణానంతరం ఆత
్మ, స్వర్గం నరకం వెళ్లడం కానీ పూర్వ జన్మ కానీ మరో జన్మ కానీ వుండవు.
మరణంతోనే ఆత్మ అనే శరీరం ప్రకృతిలో కలసిపోతుంది.
చావు పుట్టుక మధ్య మనిషి తన ప్రయాణంలో తను కోరుకున్నట్టు సుఖంగా జీవించటమే జీవిత పరమార్ధం.
దేహమనే ఆత్మ దేహంలో చైతన్యము నశించటంతో మరణం అనే మోక్షంతో జీవితం మొత్తం అయిపోయినట్టే.
శరీరం చైతన్యంతో జీవిస్తుంది.
చైతన్యం నశించిన వెంటనే ఆత్మ అనే శరీరం నశిస్తుంది.
మరణంతో శరీరం అనే ఆత్మ నశిస్తుంది. ఆత్మ శరీరం అనేవి ఒక్కటే.
రెండు భిన్నమైన పదార్థాలు కావు.
ఉన్నది ఒక్కటే జీవితం.
చైతన్యం వున్న శరీరం చైతన్యం కోల్పోక ముందే అనుభవించాలి.
మరణంతో మొత్తం అయిపోతుంది. ఇంకా ఏ లోకం ఏ జీవితం లేదు.
అందరి జీవితాలు కూరలో గరిట లాంటివే.
కూరలో ఉన్న రుచి గరిటకు తెలియనట్లే..
మనిషిగా పుట్టి మనిషి జీవితం యొక్క స్వభావం మరచి చనిపోతున్నారు-నర్ర పాండు✍️