STORYMIRROR

Dinakar Reddy

Comedy Children

3  

Dinakar Reddy

Comedy Children

జేమ్స్ బాండ్ vs జేమ్స్ పాండ్

జేమ్స్ బాండ్ vs జేమ్స్ పాండ్

1 min
241

మరో రెండు రోజుల్లో రమ్య అమెరికన్ ప్రెసిడెంట్ ను భారత పర్యటనలో కలుసుకోబోతోంది. ఆమె చేసిన కొత్త వంటకాన్ని ఆమె రుచి చూడాలని అమెరికన్ ప్రెసిడెంట్ భావిస్తున్నారు అని అధికారికంగా ప్రకటించారు.


అదే రోజు రాత్రి రమ్య ఇంట్లో..

జేమ్స్ బాండ్ రమ్య ఇంట్లోకి ప్రవేశించాడు. మరుసటి రోజు మీడియాతో మాట్లాడాల్సిన విషయాలన్నీ రమ్య బెడ్ రూంలో కూర్చుని కాగితం మీద రాసుకుంటోంది.


డూప్లికేట్ తాళం చెవితో తలుపు తీసి జేమ్స్ బాండ్ వంట గదిలో వెతుకుతున్నాడు.


అప్పుడే ఎవరో అతని వెనుకగా వచ్చి భుజం మీద చేయి వేశారు. అదిరి పడ్డ జేమ్స్ బాండ్ గన్ తీసి ఆ వచ్చిన మనిషి తల మీద పెట్టాడు.


బాండ్ నేను. జేమ్స్ పాండ్ ని అన్నాడు చంటబ్బాయి కంగారుగా.

ష్. అనుకుంటూ వారి నోటిని చేతులతో మూసుకున్నారు. 

పాండ్! ఈ అమ్మాయి అమెరికన్ ప్రెసిడెంట్ కి తినిపించబోయే వంటకం ఫార్ములా కావాలి అన్నాడు జేమ్స్ బాండ్.

ఒక్క నిమిషం బాండ్ అంటూ చంటబ్బాయ్ ఏదో టీవీ యాంకర్ లా అన్నాడు.


మా ఆడవాళ్ళకి పోపుల పెట్టె లో రహస్యాలు దాచే అలవాటు ఉంది అని పోపుల పెట్టెలో వెతికి ఏదో పేపర్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.


మిషన్ అకంప్లిష్డ్ అన్నట్టు జేమ్స్ బాండ్ వైపు చూసి సైగ చేశాడు చంటబ్బాయ్.


ఇంతలో జేమ్స్ బాండ్ వంట గదిలో పాత్రల్ని తగలడంతో రమ్య ఎవరూ అంటూ కేక వేసింది.

జేమ్స్ బాండ్ ఇంకా జేమ్స్ పాండ్(చంటబ్బాయ్) ఇద్దరూ మ్యావ్ మ్యావ్ అంటూ పిల్లుల్లా అరుస్తూ బయటికి వెళ్లిపోయారు.


Rate this content
Log in

Similar telugu story from Comedy