Kishore Semalla

Comedy Drama Horror

4.8  

Kishore Semalla

Comedy Drama Horror

ఘోస్టల్ (G'Hostel)~పార్ట్ 3

ఘోస్టల్ (G'Hostel)~పార్ట్ 3

5 mins
1.2K


      షాక్ లో నుంచి మెల్లగా తేరుకొని ఒక్కొక్కరుగా మాట్లాడటం మొదలుపెట్టారు.

          దెయ్యాల స్టోరీ కాకుండా ఏదన్నా కామెడీ షార్ట్ ఫిల్మ్ చేద్దాం రా ట్రెండింగ్ గా ఉంటుంది అని సూరి చెప్పాడు. దానికి రాజు ఏంటి? మళ్ళీ చెప్పు వినపడలే అని ఎడమ కనుబొమ్మ పైకి లేపి కోపంగా చూసేసరికి సూరి వెంటనే జడుసుకుని- " అబ్బే, ఎవడు చూస్తాడు కామెడీ షార్ట్ ఫిల్మ్, హారర్ ఏ తీద్దాం" అని ఒక పక్క భయపడుతూ ఇంకో పక్క తప్పదు అన్నట్టు ఒప్పుకున్నాడు.

        మరి మీ సంగతి ఏంటి? అని రాజు మిగతా ఇద్దర్ని అడిగాడు. దానికి రవి- భావ, రాత్రి తొమ్మిది అయింది, అమ్మ ఇంట్లో ఒక్కరే వున్నారు. నేను వెళ్తా, తీద్దాం మనం హారర్ షార్ట్ ఫిల్మ్ ఏ తీద్దాం. కానీ రేపు మాట్లాడుకుందాం దీని గురించి అని మెల్లగా తప్పించుకోబోయాడు.

       భావ వెళ్ళొస్తానే నేను అంటూ అక్కడ నుంచి జారుకుని పారిపోదాం అని నెమ్మదిగా తలుపు వరకు వెళ్ళాడు. తలుపు లాగుతున్నాడు కానీ అది రావడం లేదు. వెనక్కి తిరిగి చూసాడు, అందరూ కూడా ఏమైంది అని ఒక్కసారి అడిగారు, ఇంతలో రాజు డోర్ రావడం లేదా? అని అడిగాడు.

      దానికి రవి వణుకుతున్న గొంతుతో, అవును నీకెలా తెలుసు? 🤔 అని ఆశ్చర్యం తో అడిగాడు. డోర్ తీస్తా కానీ తర్వాత ఏం జరిగినా నా పూచి కాదు అని ముందే హెచ్చరించాడు.

     రవి ఏదో ఒకటి ముందు ఈ హాస్టల్ నుంచి బయట పడితే తరువాత ఏమన్నా చూసుకోవచ్చు అని డోర్ ని తెరవమన్నాడు. ఐతే ఇప్పుడు తెరువు ,తెర్చుకుంటుంది అని రాజు కళ్ళు ముసుకున్నాడు.

           వెంటనే రవి డోర్ లాక్ ని తెరిచాడు, తలుపు తెరుచుకుంది. మెల్లగా తెరిచి బయటకి వెళ్ళాడు. బయట అంతా చీకటి, ఏమి కనిపించడం లేదు. ఇంతలో డోర్ లాక్ మళ్ళీ పడిపోయింది. చిమ్మ చీకటి, జేబులోంచి సెల్ ఫోన్ తీసి లైట్ ఆన్ చేసాడు. తన చుట్టూ ఎవరో వచ్చి భయపెడుతున్నారు. మీద చేతులు వేసి పారిపోతున్నారు.

          భయం తో కేకలు పెడుతున్నాడు రవి. లోపల సూరి కి నిఖిల్ కి భయం తో ప్యాంట్ తడిసిపోతుంది. బయట ఏం జరుగుతుందో వాళ్ళకి అర్ధం కావట్లేదు.

          బయట రవి మాత్రం ఏడుస్తూ, ఏయ్ " ఎవరే మీరు ? నాతో ఆడుకుంటారు ఏంటి, నాకు భయం అనుకున్నారు ఏమో, మా నాన్న కార్పొరేటర్. చెప్పాను అనుకో మీ సంగతి ఇంకా అంతే" అని భయపడుతూనే దెయ్యాలను బెదిరిస్తున్నాడు.

         లోపల సూరి నిఖిల్ తో- వీళ్ళ నాన్న కి ఊర్లో వాళ్లే మాట వినరు, వీడు ఏకంగా దెయ్యాలనే భయపెడుతున్నాడు వాళ్ళ నాన్న పేరు చెప్పి అంటూ పక పక నవ్వుతున్నాడు.

        బయట రవి, అబ్బా! ఇక్కడ మెట్లు ఎక్కడ ఉన్నాయో ఏంటో, ఇవేమో నా సెల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయాయి. కాస్త నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్ళాడు. అక్కడ తడిమాడు, ఓహో! ఇది అద్దమా, లైట్ ఉంటే చూసుకునేవాడ్ని అని అనుకున్నాడు. వెంటనే లైట్ అద్దం పైన పడింది. చూస్తే విడి భుజం పైన ఒక దెయ్యం కూర్చుని ఉంది.

       అంతే ఇక ఒకటే పరుగు తీసి రూమ్ దగ్గరకి పరిగెత్తాడు. తలుపు తియ్యండ్రా అంటూ కేకలు పెడుతున్నాడు. లోపల వీళ్ళు నవ్వుకుంటున్నారు. రాజూ తో రవి - మళ్ళీ నువ్వు వెళ్ళమని అనే వరకు ఇక్కడే ఉంటారా తలుపు తియ్యరా అని ఏడుస్తూ బ్రతిమాలాడు. వెంటనే డోర్ ఓపెన్ అయింది లోపలికి దొర్లుకుంటు వచ్చి పడ్డాడు.

       రవి ని చూసి సూరి మరియు నిఖిల్, అంతలా భయపడ్డావ్ ఏంట్రా? ఏముంది రా బయట అని అడిగినా సమాధానం ఇచ్చే పరిస్థితి లో లేడు రవి.

      మీరు ఆపితే నేను మొదలుపెడతా అని రాజు మధ్యలో మాట్లాడాడు. ఏం నిఖిల్ నీకు ఇంకా ఏమన్నా సంకోచాలు ఉన్నాయా , ఉంటే ఒకసారి నువ్వు అలా బయటకి వెళ్లి రా అన్ని తిరిపోతాయ్ అని సలహా ఇచ్చాడు.

         నిఖిల్ ఇలా అనుకున్నాడు- "బయటకెళ్లిన రవి గాడి పరిస్థితి అలా ఉంటే, దెయ్యాలంటే ప్యాంట్ తడుపుకునే నేను వెళ్తే తిరిగొస్తానా?" అనుకుని, నాకు కొంచెం ఆలోచించే టైం ఇవ్వమని పక్కకెళ్లి కిటికీ దగ్గర నిల్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు.

           ఇంతలో కిటికీ ముందు నుంచి తెల్లని ఆకారం ఒకటి వెళ్ళింది. నిఖిల్ భయపడదం మొదలుపెట్టాడు. సరే నా భ్రమ కూడా అయుండొచ్చు అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు.

           కళ్ళు తెరిస్తే ఎదురుగా రాజు, వెంటనే వెనక్కి పడ్డాడు నిఖిల్. నిఖిల్ మొఖం లో మొఖం పెట్టి ఇంతకీ సమ్మతమ కాదా? అని భయపెట్టినట్టు అడిగాడు. నిఖిల్ జడుసుకుని, సమ్మతమా అంటే అని ఆలోచించే లోపే రాజు మొఖం దెయ్యం లా మారిపోయింది. సమ్మతమే సమ్మతమే అని నిఖిల్ ఏడుస్తూ, "ఎరక్కపోయి వచ్చి ఇర్రుకు పోయా రా" అనుకున్నాడు.

          నిఖిల్ ని సూరి, రవి వింతగా చూస్తున్నారు. రాజు చూస్తే ఇక్కడ వున్నాడు. వీడు ఎవడ్ని చూసి అంతలా అరుస్తున్నాడు రా పిరికి ఎదవ అనుకుని నవ్వుకున్నారు ఇద్దరు.

         వీళ్ళతో పాటు నిఖిల్ కూడా చేరాడు తోడుగా. వీడు రాజు గాడే నా? భయపెట్టి చంపుతున్నాడు. ముగ్గురు భయపడుతూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో రాజు - మీ మాటలు పూర్తి ఐతే మనం షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడదం అని చొరవ తీసుకున్నాడు.

        సరే కథ ఏంటి?, ఎప్పుడు చేద్దాం? దానికి కావాల్సిన కెమెరా, లైటింగ్ మంచి హాస్టల్ అన్ని కావాలి కదా మనకి. అసలు ఎలా చేయబోతున్నావ్ మాకు వివరంగా చెప్పు అని సూరి అడిగాడు.

        రాజు ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. చాలా గట్టిగా నవ్వుతున్నాడు. చుట్టూ గది నిండా ప్రతిధ్వని వస్తుంది. వీళ్ళకి భయం మొదలయ్యింది.

        మీకు గా వచ్చి ఇరుక్కున్నారు. ఇక ఇక్కడ నుంచి బయటకి వెళ్లడం మీ తరం కాదు. మీ చావే ఇప్పుడు తియ్యబోయే మీ షార్ట్ ఫిల్మ్. "హాహాహా, హాహాహా" అంటూ నవ్వుతున్నాడు. గదిలో లైట్స్ అన్ని జిల్ జిల్ మని ఆరుతూ వెలుగుతున్నాయి.

        భయం తో ముగ్గురు పరుగు తీశారు, తలుపు ని తోసుకుని ముగ్గురు బయటకి వచ్చారు. అంతా చీకటి. మొబైల్ ఆన్ చేయరా అని నిఖిల్ ఏడుస్తూ సూరి కి చెపుతున్నాడు.

          ఆన్ అవ్వట్లేదు రా, ఏంట్రా ఇలా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం అని రవి. అవును రాజు గాడు ఇలా మారిపోయాడు ఏంటి, మనం ఉన్నది వాడి హాస్టల్ లొనే నా. దారి తప్పి వేరే హాస్టల్ కి వచ్చామా. ఏంటో అంత అయోమయంగా ఉంది అని ముగ్గురూ మాట్లాడుకుంటూన్నారు.

          ఇంతలో 313 రూమ్ తెరుచుకుంది. అందులో కూర్చుని అదే కుర్రాడు మళ్ళీ చదువుకుంటున్నాడు.

కూర్చుంది రాజు కాదు. వేరే ఇంకెవరో. మళ్ళీ అదే భయం ఆ కుర్రోడికి.

          సూరి లోపలికి వెళ్దాం పదండి అని రవి మరియు నిఖిల్ ని అడిగాడు. భయపడుతున్న నిఖిల్ వద్దు రా, వాడు రాజు కాదు. వేరే ఇంకెవరో తను. ఎందుకు ప్రమాదం మీదకు తెచ్చుకోవడం అని భయపడ్డాడు.

          ఇంతలోనే సూరి ఫోన్ మోగింది. చూస్తే అది రాజు దగ్గర నుంచి. పక్కనే ఉన్న రాజు ఎందుకు కాల్ చేసాడు అని కాస్త దైర్యం తెచ్చుకుని కాల్ లిఫ్ట్ చేసాడు. "ఇంకా ఎక్కడున్నార్రా? " , "మీకోసం చాలా సేపటి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్న". "ఇంకా రాకుండా ఎక్కడ ఏం చేస్తున్నారు? " అని రాజు అడిగాడు.

           ఇంకా రాకపోవడం ఏంటి రా, ఇంత వరకు మాకు ఒక హారర్ సినిమా చూపించి ఏమి తెలీనట్టు మళ్ళీ కాల్ చేస్తావా. ఇక భయపడే ఓపిక లేదురా. నీకు దండం పెడతాం మమ్మల్ని ఇక్కడ నుంచి బయట పడేయరా అని ముగ్గురు రాజు ని బ్రతిమాలుకున్నారు.

           అసలు మీరు ఏ హాస్టల్ కి వెళ్లారు అని అనుమానంగా అడిగాడు. దానికి సూరి మీ హాస్టల్ ఏ రా, " శ్రీ సాయి నివాస్".

           కాదురా మాది " శ్రీ లక్ష్మి నివాస్". మీరు వెళ్ళిన హాస్టల్ మూసి మూడేళ్లు అవుతుంది అని చెప్పి వెంటనే అక్కడ నుంచి పారిపోయి తప్పించుకోండి. నేను అటు వైపు వస్తున్న, మీరు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసాడు.

          అది విన్న ముగ్గురు, దెయ్యం తోనా ఇంత సేపు మనం టైం పాస్ చేసింది అని నోర్లు ఎల్లబెట్టి ఇక బయట పడడం ఎలా రా? అని ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.

--------------------------*------------------*-------------------------

సూరి, రవి మరియు నిఖిల్ తప్పించుకుంటారా?

వీళ్ళు కూడా ఆ కుర్రాడికి బలి అయిపోతారా?

అసలు ఆ కుర్రాడు ఎవడు?

రాజు వీళ్ళని కాపాడతాడా?

ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడాలి. 😍

       

         

    


Rate this content
Log in

Similar telugu story from Comedy