Dinakar Reddy

Comedy Drama

3  

Dinakar Reddy

Comedy Drama

ఘోస్ట్ రైటర్

ఘోస్ట్ రైటర్

1 min
221


ప్రజ్వల బుక్స్ లో ఈ మధ్య రొమాన్స్ తగ్గిందే అన్నాన్నేను ఉమతో. ప్రజ్వల నా అభిమాన రచయిత్రి. కన్నె పిల్లల గుండెల్లోని మాటలను అందంగా వ్రాసి అబ్బాయిల మతులు పోగొట్టడం ద్వారా తన రచనల్ని పాపులర్ చేశాయి.


ఆ మొన్నీమధ్యే పెళ్లయ్యింది కదా రాజీ. అందుకే రొమాన్స్ తగ్గి ఉంటుంది అంది ఉమ జుట్టు దువ్వుకుంటూ.


ఛీ. ఏంటే ఆ మాటలు అని అన్నాను నేను విసుగ్గా. నేనేమన్నానే. పెళ్లి తరువాత ఇంటి బాధ్యతలు చూస్తూ బిజీ అయిందేమో అందుకే రొమాన్స్ తగ్గింది అన్నాను అంతే అని బదులిచ్చింది ఉమ.


ఏమైనా ప్రజ్వల గారి నవల అంటే అబ్బాయిలు అమ్మాయిలు పడి చచ్చిపోతారనుకో. అవునే ఉమా. ఈ రైటర్లకి నిజంగానే అంత రొమాంటిక్ జీవితం ఉంటుంది అంటావా అని మళ్లీ నేనే అడిగాను.


ఏమోనే బాబూ. అసలే జుట్టు చిక్కు రావట్లేదని నేను ఏడుస్తుంటే నువ్వు చిక్కు ప్రశ్నలు అడుగుతున్నావు. అయినా ఆ ప్రజ్వల నిజంగానే వ్రాస్తుందో లేక ఎవరైనా ఘోస్ట్ రైటర్ తో వ్రాయిస్తోందో ఎవడికి తెలుసు. చాలా మంది ఆమె ఘోస్ట్ రైటర్ తో వ్రాయిస్తుంది అంటారే బాబూ అంటూ ఉమ చిక్కు తీసేటప్పుడు దువ్వెనకు వచ్చిన వెంట్రుకల్ని ముడి వేసి బయట పడేయడానికి వెళ్ళింది.


అంతేనా. ఉమ చెప్పినట్టు ఘోస్ట్ రైటర్ తో వ్రాయిస్తే రొమాన్స్ ఎందుకు తగ్గుతుంది. ప్రజ్వల ఎప్పటికీ రొమాన్స్ బ్రహ్మాండంగా వ్రాస్తుంది అనుకుని ఫోన్లో న్యూస్ చూసింది.


నేను భానుమతి గారి అత్తగారి కథలు లాంటి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకు వస్తాను అని ప్రజ్వల లేటెస్ట్ ఇంటర్వ్యూ లో చెప్పినట్లు వచ్చిన కథనం చూసి ముక్కున వేలేసుకుంది రాజీ.


ఏంటే అని అడిగి విషయం తెలిశాక ఇంకేముందీ. ఆవిడ భానుమతి గారి పుస్తకాన్ని కూడా వదలనట్టే. ఎవరో మాంచి ఘోస్ట్ రైటర్ దొరికి ఉంటుంది అని నవ్వుకుంది ఉమ.


Rate this content
Log in

Similar telugu story from Comedy