STORYMIRROR

Kishore Semalla

Comedy Horror Thriller

4.6  

Kishore Semalla

Comedy Horror Thriller

భూత్ బంగ్లా

భూత్ బంగ్లా

3 mins
28.2K


సాయంత్రం ఏడు దాటింది రాజు ఇంకా ఇంటికి రాలేదు.

రోజూ ఆరు గంటల లొపే ఇంటికి చేరే రాజు ఏడు ఐన రకపోయే సరికి కంగారు పడుతూ పక్కింటి పండు గాడిని ఆరా తీయడానికి వెళ్ళింది రాజు వాళ్ళ అమ్మ. 


పండు గాడు కూడా ఇంకా ఇంటికి రాలేదని వాడి కోసం ఇప్పుడే వాళ్ళ నాన్న వాడ్ని తీసుకు రాడనికి వెళ్ళారని పండు వాళ్ళ అమ్మ వివరించింది.


సమయం పెరిగే కొద్దీ ఆందోళన మరింత ఎక్కువైంది. ఆడుకోడానికి వెళ్ళిన వీరిద్దరు ఎటు వెళ్ళారని ఇరు ఇళ్లలో వెతుకులాట మొదలయింది.

ఊరంతా వెతికిన వీళ్ళ జాడ తెలీలేదు.


రాత్రి పది అయింది రాజు స్నేహితుడు ఐన రమేశ్ దగ్గరకు వెళ్ళారూ రాజు తల్లిదండ్రులు. తమకేమీ తెలీదు అన్న రమేశ్ గుర్తు తెచ్చుకొని ఒక మాట చెప్పాడు.


ఆట మధ్యలో సర్పంచి గారి అబ్బాయితో రాజు కి గొడవ అయింది. ఆ గొడవలో రాజు ఇంకా పండు ఇద్దరు కలిసి సర్పంచి గారి అబ్బాయిని రక్తం వచ్చేలా కొట్టి పారిపోయారు. ఇంటికి వెళ్ళి ఉంటారు అని అందరం అనుకున్నాం కానీ ఇంకా ఇంతవరకు రాలేదంటె మాకు భయం వేస్తుంది అని సమాధానం ఇచ్చాడు రమేశ్.


ఇంతలో పండు తో సహా పండు వాళ్ళ నాన్న ఆనందం తో తిరిగొచ్చారు. ఇది తెలిసిన రాజు వాళ్ళ అమ్మ తన కొడుకు కోసం పరిగెత్తుకు వచ్చింది. తన కొడుకు దొరకలేదని తెలిసి ఆ తల్లి తల్లడిల్లి పోయింది, బోరున ఏడుస్తూ తన కొడుకు జాడ తెలియజేయమంది. తన కన్నీరు చూసి ఆ తండ్రీ కూడా తట్టుకోలేక పోయాడు.


ఇద్దరు కలిసి వెళ్లారుగా, మరి నా కొడుకు ఎందుకు నీతో లేడు అని ప్రశ్నించాడు రాజు తండ్రి. పండు ఒక వైపు భయం తో మరో వైపు కంగారు తో ఎం మాట్లాడలేక పోతున్నాడు. గొంతు లోంచి మాట రావడం లేదు. కళ్ళంతా భయం తో నిండి పోయాయి. ఒక గ్లాసు మంచి నీళ్లు త్రాగి ఇలా చెప్పాడు.


ఆట మధ్యలో సర్పంచి గారి అబాయిని కొట్టి ఊరి చివర వరకు పరిగెత్తం. అలా అక్కడికి చేరక నాకు భయం పెరిగి తిరిగి వెళ్లిపోదాం అని రాజు ని బ్రతిమాలను. నా మాట వినని రాజు ఊరు చివర ఉన్న బంగ్లా లోకి వెళ్ళాడు. నేను అంత ధైర్యం చెయ్యలేక తిరిగి వచ్చేశాను .


ఆ బంగ్లా అని చెప్పిన వెంటనే ఊరంతా ఉలిక్కిపడింది. భయం తో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ బంగ్లా లోకి వెళ్లాలి అంటేనే భయంతో వొణికి పోయే ప్రజలు , బంగ్లా లోనికి వెళ్లిన రాజు పరిస్థితి ఏంటి అని ఉశులు పంచుకున్నారు.


రాజు వాళ్ళ అమ్మ, నాన్న ఆ చీకటిలో రాజు కోసమని ఆ బంగ్లా వైపు బయల్దేరారు. 


ఊరి ప్రజలు ఎవరూ తోడు రాలేదు అక్కడ ఏం జ

రుగుతోందన్న బియ్యం తో. రాత్రంతా ఊరి ప్రజలూ ఎవరూ నిద్రపొలేదు. కంటి మీద కునుకులేకుండా ఎదురు చూస్తున్నారు.


కాసేపు అయ్యాక పండు వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి చేరుకున్నారు. 


పొద్దున్న ఏడు దాటింది, రాత్రనగ రాజుని వేతకదానికి వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదంటు ఊరి ప్రజాలంతా కంగారు పడుతున్నారు. వాళ్ల రాకపోవడాన్ని గమనించిన ప్రజలు , వాళ్లు ఖచ్చితంగా అందులో ఉన్న దెయ్యానికి బలి అయిపోయి ఉంటారని భావించారు.


వెంటనే ఊరు వాళ్లంతా కలిసి పంచాయతి పెట్టారు. సర్పంచి గారితో జరిగిన విషయాన్నీ వివరించారు. వెంటనే సర్పంచి బయల్దేరి అక్కడికి చేరుకున్నాడు. 


పగలైనా లోనంత చీకటి. తిన్నగా ఉన్న మెట్ల పై నడుస్తూ పైకి చేరుకున్నాడు. కుడి వైపు ఏదో శబ్ధం అయ్యే సరికి అక్కడున్న గదిలో కి దూరాడు.


కాసేపటికి ఆ గదిలో నుంచి ఏడుపులు వినపడడం మొదలయ్యాయి. అది విన్న ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అక్కడ పెట్టెలు విరిగి పడి ఉన్నాయ్. మరి ఏడుపు ఎక్కడ అని చూస్తే సర్పంచి ఏడవడం చూసి అందరూ ఆశ్చర్య పోయారు.


సర్పంచి ఏడుపు వెనక అసలు కథ ఏంటని పరిశీలించగా ఆ భూత్ బంగ్లా లో తాను ప్రజలు దగ్గర దోచుకున్నదే కాకుండా తను సంపాదించిన దొంగ సొమ్ము అంతా దోచుకుపోయారు రాజు, పండు, వాళ్ళ అమ్మ నాన్న లు.

మరి ఇందులో దెయ్యాలు ఉన్నాయన్న విషయం ఆరతిస్తే ఆ పుకార్లు కూడా పట్టించింది కుడా సర్పంచే.


మరి ఈ విషయం ఊర్లో ఇంత మంది వుండగా వాళ్ళు మాత్రమే ఎలా గమనించారని వూర్లో ప్రజలంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.


అసలు జరిగిన కథ:


సర్పంచి గారి అబ్బాయిని కొట్టి పారిపోయిన రాజు, పండు చీకటి పడేంత వరకు ఇంటికి వెళ్లకుండా ఆ భూత్ బంగ్లా దగ్గర దాగి వున్నారు. మరీ చీకటి పడింది ఇంటికి బయల్దేరుదాం అన్న వాళ్ళకి రెండు దీపాలతో అటు వైపు గా మనుషులు వెళ్ళడం గమనించారు . వెంటనే వాళ్ళని వెంబడిస్తూ అటు వైపు గా సాగారు. వాళ్లు భూత్ బంగ్లా వైపు వెళ్లడం గమనించిన వీళ్లు, వాళ్ళు వెల్లేంత వరకూ ఆగి అక్కడ ఏముందని పరిశీలించారు. అక్కడ కోట్ల విలువైన సొమ్మును, నగలను చూసిన రాజు కి ఒక ఉపాయం తట్టింది. అందుకే ముందు పండు ని వాళ్ళ నాన్న తో పంపి ఇక్కడ భయన్ని అక్కడ ప్రజలకు తెలియజేసి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేలా చేసుకున్నాడు. అక్కడికి కాసేపటికి పండు వాళ్లని రమ్మని వివరించాడు.


ఇలా తెలివైన రాజు తనకన్న మేధస్సు తో సర్పంచ్ కి వాడి కొడుక్కి కన్నీరు మిగిల్చాడు.😀


Rate this content
Log in

Similar telugu story from Comedy