బాసూ!
బాసూ!


ఏంటోరా జీవితం బాగా బోర్ కొడుతోంది అన్నాను ఫ్రెండ్ తో.
ఎంత బాగా బోర్ కొడితే అంత బాగా నీళ్ళు పడతాయా మీ ఏరియాలో అన్నాడు వాడు.
నీ కుళ్ళు జోకుకు నాకు నవ్వు రావట్లేదు సరి కదా వాంతి వచ్చేట్లు ఉంది అన్నాను.
పర్లేదులేరా నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నేను బాస్ ని అడిగి లీవు పెట్టుకుంటాను అన్నాడు వాడు.
ఎందుకురా అన్నాను.
మా బాస్ నాకు లీవు ఇవ్వాలంటే నేను ఎవరినయినా బ్రతికుండగానే చంపేయాలి.లేదంటే
క్రితం సారి లీవు పెట్టినప్పుడు మన రాకేష్ గాడికి ఆక్సిడెంట్ అయ్యిందని చెప్పి నీ పెళ్ళికి వచ్చాను.
మా బాస్ ల గురించి తిట్టుకుంటూ జోకులు వేసుకుంటూ కన్నీళ్లు వచ్చేదాకా నవ్వుకున్నాము.