STORYMIRROR

Kishore Semalla

Comedy Drama Romance

4.8  

Kishore Semalla

Comedy Drama Romance

అమ్మాయిలు అర్ధం కారు బాసు😄😍

అమ్మాయిలు అర్ధం కారు బాసు😄😍

5 mins
23.6K


         అవును తను ఏంటో అన్న విషయం తనని దూరం చేసుకున్నాక నాకు ఇప్పుడు తెలుసుతుంది. తనని వదిలి వచ్చి రెండేళ్లు అవుతుంది. తను నాకోసం చాలా ఎదురు చూసి ఉంటుంది, వస్తా అన్న ఆశతో. తప్పు చేసానేమో అని నా మనసు నాకు పదే పదే చెప్తుంది.


  

         ఒంటరి గా బ్రతికేద్దాం, మిగతా జీవితాన్ని ఆస్వాదిద్దాం అనుకున్నా కానీ నీకోసం ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయా. నువ్వు ఎలా ఉన్నావ్ ? మన పాత రోజులు గుర్తు ఉన్నాయా? నువ్వు నాకోసం ఎదురుచూస్తున్నవా? ఎవరినైనా పెళ్లి చేసుకున్నవా? ఇలాంటి ఇంకెన్నో ప్రశ్నలు నువ్వు కనపడితే అడగాలి అని ఉంది. 


        నీతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి. ఎన్నో మాటలు, ఎన్నెన్నో కబుర్లు ఇంకెన్నో ఉశులు పంచుకున్నాం. కానీ అవేవి నాకు గుర్తుకు రాలేదు ఇన్ని రోజులు. నీకు నాకు మధ్య దూరం దేశాలు దాటేసింది. 



        జీవితం నీతోనే అనుకున్నా. నా కోసమే పుట్టావు అనుకున్నా. ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు వుండలేకపోయేవాళ్ళం. నాకు గుర్తుంది, నిన్ను మొదటి సారి కిస్ చేసినప్పుడు చాలా సిగ్గుపడ్డావు. ఆ సిగ్గులో నీ అందం నాకింకా గుర్తుంది.


        "గులాబీ పువ్వుల నీ బుగ్గలు ఎర్రబడ్డాయి. నవ్వు నీ మొఖం లో నాట్యం ఆడింది. గాలికి వదిలేసిన నీ కురులు ఎగురుతూ వుంటే చూడడానికి నా కళ్ళు అదృష్టం చేసుకున్నాయి అనిపించింది."



         నాకు జీవితం పట్ల అస్సలు బాధ్యత లేదు అని మందలించావ్ చాలా సార్లు. నాకు కోపం వచ్చేది. అప్పటి వరకు నచ్చిన నువ్వు నాకు నచ్చడం మానేశావ్. చిరాకు అనిపించేది. చీటికీ మాటికి గొడవలు నా వల్ల కాలేదు. నీతో జీవితం ఊహించడానికే భయం వేసింది.


        

         మన మధ్య ప్రేమ కి ఇక చోటు లేదు అనిపించింది. మాట్లాడుకున్నాం, నువ్వు వద్దు అన్నావ్. కానీ ప్రేమ లేని చోట నేను వుండలేనని నిన్ను వదిలి వచ్చేసాను. చాలా సార్లు అనిపించింది తప్పు చేశా అని. కానీ వచ్చే పరిస్థితి కాదు నాది. ఎలా చెప్పను నీకు ఇదంతా, అసలు చెప్పే అవకాశం ఇస్తావా? ఇలా చాలా అనుమానాలు లోలోపల తిరుగుతూనే ఉన్నాయి.


         ఇంతలో బస్ ఆగింది. చాలా కాలం తరువాత వచ్చిన మా ఊరు. అలానే వుంది. బస్ దిగి దిగగానే బాషా అన్న- "ఏం తమ్ముడు, సేన ఏళ్ళ తరువాత వచ్చావ్, బాగున్నవా? అని అడిగాడు. పాపాయమ్మ- ఏం కొడకా, నువ్వు లేక ఊరు ఒట్టాయిపోనాదిరా. ఎన్నాలకు ఊరు గుర్తొచ్చినాది రా నీకు అని ఇకటం( joke ) ఆడింది. 


    

        పాత రోజులు గుర్తుకు వస్తున్నాయ్. ఇంతలో సైకిల్ బెల్ వినిపిచింది. నాకు తన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. 


   

        మా ఇంటి వెనక వీధిలో వుండేది తను. కలవాలి అనుకుంటే ఇంటి నుంచి బయల్దేరే ముందు బెల్ కొడుతుంది. అది విన్న నేను ఇంట్లో ఏదో ఒక సాకు చెప్పి కలిసేవాడ్ని తనని. 


   

         మళ్ళీ ఈ బెల్ సౌండ్ నాకు తనని గుర్తు చేసాయి. వెనక్కి తిరిగి చూసాను. స్కూల్ పిల్లలు సైకిల్ మీద వెళ్తున్నారు. 



         ఇంటికి చేరేంత వరకు దారి పొడుగునా ఎవరో ఒకరు కలుస్తూనే వున్నారు. ఇంటికి చేరాను బాగా అలసిపోయింది శరీరం. స్నానం చేస్తూ తన గురించే ఆలోచన. వెంటనే తనని కలవాలి, మళ్ళీ గుర్తొచ్చాయి తనతో గడిపిన క్షణాలు.



          తనని సాగర్ అని మా తరగతి విద్యార్థి ఎడిపించాడు ఒకసారి. నాతో తను తీరుగుతుంది అని, మా ఇద్దరి విషయం ఇంట్లో చెప్తా అని భయపెట్టాడు తన ని. నాకు ఆ విషయం తెలిసి స్కూల్ గ్రౌండ్ మొత్తం తిప్పి తిప్పి కొట్టాను. కానీ అదే గ్రౌండ్ లో అదే స్టూడెంట్స్ ముందు నా చెంప చెళ్లుమనిపించింది తను. నేను తన కోసమే చేసాను. కానీ నన్నే కొట్టింది. మళ్ళీ బాధ లో ఉన్న నన్ను వచ్చి కిస్ చేసింది. కోపం తగ్గేంతాల కౌగిలించుకుంది. తన ప్రేమ నాకు అర్ధం అయ్యేది కాదు అని నవ్వకునే వాడ్ని.


  

       స్నానం చేసి బయటకి వచ్చాను. టిఫిన్ చేస్తూ, అమ్మ! నీకు శ్యామల రావు గారు గుర్తున్నారా? మన వెనుక వీధిలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ వుంటున్నారో తెలుసా అని అడిగాను. ముందు టిఫిన్ చెయ్ అని చెప్పింది. 



        మళ్ళీ కాసేపటికి అమ్మ! వాళ్ళ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. కానీ నేనే మొండిపట్టుదల తో తనని వదిలేసి వెళ్లిపోయా. తనని కలవాలి, నా ప్రేమ ని చెప్పాలి. వాళ్లు ఎక్కడున్నారో చెప్పు అమ్మ అని అడిగాను.


   

        "ఇన్ని రోజులు ఏమైందిరా నీ ప్రేమ." తను నీకోసం ఎదురుచూసింది. చాలా సార్లు నీకోసం ఇక్కడికి వచ్చింది. పాపం ఆడపిల్లని అర్ధం చేసుకోలేకపోయావ్. అమ్మాయిలు అర్ధం కారు, ఏది కూడా తిన్నగా చెప్పలేరు. కానీ మీరే ప్రాణంగా బ్రతుకుతారు. 


        మీ నాన్న కి నాకు చాలా సార్లు గొడవ జరిగింది. నేను ఎప్పుడు ఏ విషయం లో ఐనా ఎక్కువగా అలుగుతూ ఉండేదాన్ని. అది మీ నాన్న కి నచ్చేది కాదు. కానీ మళ్ళీ తనే వచ్చి బుజ్జగించేవాడు. ఇష్టం గా తన కోసం నేను ఎన్నో వంటలు చేసేదాన్ని. అదే సర్దుకుపోవడం. "ప్రేమ లో రెండు ఉండాలి." అర్ధం చేసుకోవడం , సర్దుకుపోవడం. కేవలం నీ మంచి కోసం చెప్పిన మాటలు నీకు కోపం తెప్పించాయి.


       పో... తనకి ఈరోజు నిశ్చితార్థం, వెళ్లి అక్షింతలు వేసి దీవించి రా అని కోపం తో వంట గదిలోకి వెళ్ళిపోయింది. 


       "తను శివాలయం వీధి లో మూడో లైన్" లో ఉంటుంది. నువ్వు అటు వైపు వెళ్లకు అని నాకు అడ్రస్ తెలియాలని గట్టిగా చెప్పింది. 


       నవ్వుకుని, సరే అమ్మ వెళ్లను. నువ్వు చెప్పాక వెళ్తానా!!!! అని వెటకారం చేసాను. అమ్మ మురిసిపోయింది లోపల. 


       ఈరోజు తన నిశ్చితార్థం. కానీ తను నా సొంతం. వదులుకుంటానా. అవకాశమే లేదు. 



       వెంటనే బయల్దేరాను. అక్కడ అన్ని పనులు హడావిడి గా జరుగుతున్నాయి. తనని ఎలా ఎదురుకోవాలి? తను కోపం లో వుంది. ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలి?? ఇవే ప్రశ్నలు నా మదిలో. 


       ముహూర్తం ఖరారు చేసే సమయం వచ్చేసింది. వెనుక వరుస లో నేను నిల్చున్న. తను నన్ను చూసింది. ముందు ఆనందం తో మొఖం మురిసిపోయినా, తరువాత జరిగిన విషయం గుర్తు వచ్చిందేమో కోపం తో తలని తిప్పేసింది. 


       చూడు... ఇతనే నాకు కాబోయే పెళ్ళికొడుకు అన్నట్టు చూపించింది. ఉంగరం తొడిగే సమయం వచ్చింది. 


చూస్తున్న....... పెడుతుందా????? పెట్టదా???????

            పెడుతుందా?????? పెట్టదా??????


        

       ఆలోచనలో పడిపోయింది. చుట్టూ ఎంత మంది వున్నా, నాకు తన కళ్ళే కనిపిస్తున్నాయి. తను పడే టెన్షన్, తనకు నా పైన ఇంకా ప్రేమ ఉందని గుర్తు చేసాయి. 


       పెట్టకూడదు దేవుడా! అని మొదటి సారి దేవుడికి మొక్కాను. విన్నాడేమో, తను ఉంగరం తొడగలేదు. అందరి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయింది.



        నాకు తన ప్రేమ అప్పుడు కనిపించింది. తన ఇంట్లో పెద్ద గొడవ, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. మెల్లగా అక్కడ నుంచి జారుకుని ఇంటికి వచ్చేసాను.



        తర్వాత రోజు తను పని చేస్తున్న స్కూల్ కి వెళ్ళాను. చిన్నపిల్లలకి పాఠాలు చెప్తున్న చిన్న పిల్లని చూసాను. డోర్ వరకు వెళ్లి తనకి కనపడకుండా నిల్చున్నా. పిల్లలు నన్ను చూసారు. చెప్పొద్దని సైగ చేసాను వాళ్ళకి. 


         పిల్లలు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు??? మీకు నన్ను చూస్తే నవ్వు వస్తుందా???


         రేయ్ నువ్వు లే అని ఒక పిల్లాడ్ని లేపి, నువ్వు చెప్పు నేను రైట్ ఆ?? రాంగ్ ఆ ?? అని అడిగింది. పిల్లాడు దేని గురించి మిస్ అని అడిగాడు. ఏం మాట్లాడకు అని మళ్ళీ వాడ్ని ఆపేసింది.



         నేను రాంగ్ చేశా, తనని చూస్తే ఎందుకు నిశ్చితార్థం ఆపేసాను. ఎందుకు రింగ్ పెట్టలేదు. వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు. ఛ! అనుకుంది.


         నేను రైట్ చెప్పమని ఆ పిల్లాడికి సైగ చేసాను. మిస్, మీరు చేసింది "రైట్" అని చెప్పమని ఆ అంకుల్ సైగ చేస్తున్నారు అని చెప్పేసాడు.



         తను నన్ను చూసింది. కోపం తో బెత్తం పడేసి బయటకి వచ్చేసింది. 


   

         ఆగు.... నేను నిన్ను అర్ధం చేసుకోలేదు నిజమే, తప్పే.........కానీ నా ప్రేమ అబద్ధం కాదు. నిన్న నువ్వు నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో కనిపించిన ఆ మెరుపు చెప్పింది నా పైన నీకు వున్న ప్రేమ. 


       

         " నిన్ను బరిస్తాను, సహిస్తాను. నీకు కోపం వస్తే బుజ్జగిస్తాను. నాకు కోపం వచ్చినా, నేనే సర్దుకుంటాను. ఇంత ప్రేమ వుంది అని కాదు కాని, నీకెంత ప్రేమ కావాలో చెప్పు అంత ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న. కోపం వుంటే కొట్టి మాట్లాడు పర్లేదు. కానీ మౌనంగా మాత్రం వుండకు అని మనసులో వున్నది అంతా చెప్పేసాను."



       వెనక్కి తిరిగి నా దగ్గరకి వచ్చింది........తనని కౌగిలించుకో బోయ, లాగి ఒక్కటి కొట్టింది. అర్ధం కాక మళ్ళీ ప్రయత్నించా...... ఇంకోటి పీకింది. రెండు చేతులతో కొడుతూ గట్టిగా కౌగిలించుకుంది. 😍


  

       ఇన్నాళ్లు ఈ ప్రేమని వదిలి ఎంత దూరం వెళ్ళిపోయాను. తను చాలా ఎదురుచూసింది. తన కౌగిలిలో తెలుస్తోంది తన ప్రేమ. దాచుకున్న ప్రేమ అంత కన్నీళ్ల లో బయటకి వచ్చేస్తుంది. "పెళ్లి చేసుకుందామా?" అని అడిగాను.


        

       సరే.. అని ఏడుపు గొంతుతో ఇందాక చెపినట్టు, నేను చెప్పిన మాటే వింటావ్ గా. కోపం పడవు కదా? వంట అది నువ్వే చూస్కో, నేనేం నేర్చుకోలేదు. ఇక ఇంటి పనులు సగం సగం చూసుకుందాం. నేను అలుగుతాను, నువ్వు బుజ్జగించాలి. నేను చెప్తాను, నువ్వు వినాలి.


  

       అంతేనా!!! ఇంకేమైనా వున్నాయా?? మేడమ్ అని అడిగాను. ఏమన్నా వుంటే అప్పటికప్పుడు చూసుకుందాం అని చెప్పేసి గట్టిగా మళ్ళీ కౌగిలించుకుంది.



      "ఈ అమ్మాయిలు అర్ధం కారు బాసు". కోపం ఐనా, ప్రేమ ఐనా మొత్తం చూపించేస్తారు అనుకున్నా. ఇంకేముంది పెళ్లయింది, ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేసుకుంటున్నా. కానీ అదే ప్రేమ😍😍😍



     

                                                                                                    


         


        





         


Rate this content
Log in

Similar telugu story from Comedy