ఆఫీసు గాసిప్
ఆఫీసు గాసిప్
మొన్న నీరజా మేడం వాళ్ళ పార్టీలో మన మేనేజర్ కాస్త ఎక్కువ చేశాడట.
నువ్వు విన్నావా? రాహుల్ అడిగాడు ఏదో లాటరీ నంబర్ రిజల్ట్ తెలుసా అన్నట్టు.
ఎవరన్నారు బాబూ నీతో అని అడిగాను.ఎవరో ఒకర్లే. నీకు తెలుసా తెలీదా అది చెప్పు.
తెలీదు అని మళ్లీ నేను పనిలో పడిపోయాను.
ఇవాళ మధ్యాహ్నం క్యాంటీన్లో ఐటమ్స్ బాగోలేవంట కదూ. అందుకే నా మాట విని లంచ్ బాక్స్ ఇంటి నుంచే తెచ్చుకోండి అని పక్క క్యాబిన్ నుండి రావు గారి నుంచి హెచ్చరికలు.
ఎవరు చెప్పారు సార్ అని అడిగాను రావు గార్ని.
ఎవరో చెబుతూ ఉంటారు. అయినా ఆఫీసు గాసిప్పుకి ఒక మనిషి అంటూ పేరు ఉండదు అని నవ్వుతూ చెప్పాడాయన.
కాఫీ కప్పు నుంచి అంబానీ నెక్ట్స్ స్టెప్పు వరకు కాదేదీ ఆఫీసు గాసిప్పుకనర్హం అని నాలో నేను నవ్వుకున్నాను.