Venkata Rama Seshu Nandagiri

Comedy

3.0  

Venkata Rama Seshu Nandagiri

Comedy

ఆడవాళ్ళా!! మజాకా!!!

ఆడవాళ్ళా!! మజాకా!!!

1 min
299


మన్మధరావు ఆఫీసునుండి వస్తూనే "అపర్ణా, అప్పూ." అంటూ ముద్దుగా పిలిచాడు.

వంటింటి నుండి చేతిలో గరిటతోభార్యామణి వచ్చింది, ఎర్రబారిన కనులతో, ముక్కుపుటాలదురుతూండగా, ఏంటన్నట్లు చూసింది.

"ఏంటోయ్, ఆపర కాళికలా ఉన్నావ్! ఘాటైన మిరపకాయ బజ్జీలా" అన్నాడు హాస్యంగా.

"తమరు సార్థక నామధేయులై మన్మథుడైనపుడు, అపర్ణ అపర కాళికే మరి." అంది ఘాటుగా.

పెళ్ళిలో బెదురు చూపులతో, భీతహరిణేక్షయై అమాయకపు ముగ్ధలా ఉన్న భార్య, తనేనా! అన్నట్లు చూసి, "ఏమైందోయ్ ఆవగింజలా, పేలగింజలా చిటపట్లాడుతున్నావ్" అన్నాడు మళ్లీ.

"దరిద్రపు ఉపమానాలు కట్టిపెట్టి, విషయానికి రండి."

దెబ్బతిన్న పులిలా, సివంగిలా గర్జించింది.

"ఏదో లేడికూనలా, కుందేలు పిల్లలా అమాయకు రాలివి అనుకుంటే, ఏంటీ గోల?" అన్నాడు విసుగ్గా.

"అలాగైతే తమరి మన్మథలీలలు, రాసలీలలు సాగుతాయనా." హుంకరించింది కోపంగా.

"నేనేం చేసాను? అసలే అమాయకుణ్ణి, అర్భకుణ్ణి "

అన్నాడు సాధ్యమైనంత ఆశ్చర్యంగా.

"అవునా, అయితే అమాయకురాలు, అర్భకురాలైన రమ్యని గర్భవతి నెవరుచేసారో." అంది ఎగతాళిగా.

"ఏయ్, ఏమంటున్నావ్? నేనేంటి? నువ్వనేదేంటి? అన్నాడు తడబాటుగా.

"అదేమరి! ఎందుకో మరి ఆ బిత్తరచూపులు, తత్తరపాటు!" అందామె మరింత ఎకసెక్కెంగా.

"నిజంగా నాకేం తెలియదప్పూ. అందరితో సరదాగా ఉంటా అదే నా తప్పా!" అనడిగాడు బేలగా.

"అలా దారికి రండి . మితిమీరితే జరిగేది ఇదే. మీ మన్మధలీలలు, రాసలీలలు ఇంక సాగవ్." అందామె.

"వామ్మో! నీ అమాయకత్వం, ముగ్ధత్వం వెనక ఇంత

కౄరత్వమా?" అన్నాడు దీనంగా.

"అపర్ణ ఎప్పుడూ శాంతమూర్తే. సమయం వస్తే అపర

కాళిక మాత్రమే కాదు, చండీ, చాముండీ కూడా" అంది గర్వంగా.

'అమ్మో ఆడవాళ్ళంటే ఆడేవాళ్ళా, ఆడించేవాళ్ళు కానీ.' అనుకున్నాడు మన్మధరావు, మనసులో, బైటికి అనే ధైర్యం లేక.


Rate this content
Log in

Similar telugu story from Comedy