యాజ్ఞసేని ద్రౌపది
యాజ్ఞసేని ద్రౌపది
ఒంటి మీది వలువలు ఊడదీసి అవమానించవలెనని ప్రయత్నము జరుగగా
వందల కన్నుల ముందర తను కన్నీరు కార్చినది
నిస్సహాయ స్థితిలో తనను పందెంలో పణంగా పెట్టడం
సరియేనా అని ప్రశ్నించినది
దాసి దాసి అని కురు సభ యందు వికటాట్టహాసములు వినపడినవి
ఆమె హృదయము వేదనతో అల్లాడినది
భర్తలు మాటకు ఆటకు బందీలయ్యె
తనను అవమాన భారము నుండి కావమని
కృష్ణా గోవిందా నీవే దిక్కని
చేతులు జోడించి వేడినది
యాజ్ఞసేని ద్రౌపది
చీరలిచ్చి కాచిన కృష్ణునికి
మనసులో ప్రణమిల్లినది