STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

వ్యథ మిగిల్చిన మచ్చ

వ్యథ మిగిల్చిన మచ్చ

1 min
345

ఒక్కటిగా కలిసిన జ్ఞాపకాలు

వేరైనప్పుడు ఎంత బాధిస్తాయో

నాకెవరూ చెప్పలేదు


తెలిసీ పులి బోనులోకి వెళ్లేంత సాహసం

నా బాల్యం ఇవ్వలేదు

అయినా విధి కలిపినట్లు

నీ కౌగిట చేరాను

ఎంత హాయి అంటూ ప్రేమ గీతాలు ఆలపించాను


నిన్ను నిలుపుకోవాలని నే చేసిన వృథా ప్రయత్నాలు

చాచి పెట్టి నా బుద్ధిని కొట్టాయి

కళ్ళు బైర్లు కమ్మే నటన నన్ను ఆవహించింది


హృదయాన్ని పాషాణం చేసుకుని

జీవితాన్ని సాగదీస్తూ ఉన్నా కానీ

ఆనాటి మానసిక వ్యథ 

నీ నుంచి విడివడి ఏడ్చిన సొద

ఇంకా మర్చిపోలేదు నా యెద


ఆ గాయాలు మానినట్లు 

కాలం ముసురుకుంది

నాపై నన్ను ఉసిగొల్పిన చర్యల ఫలితం దాక్కుండి పోయింది

ఎక్కడో ఒక మచ్చలా 

ఇంకా వన్నె తగ్గలేదు

జ్ఞాపకాల వరుసలో కలిసిపోలేదు

అది నీ పేరు విన్నప్పుడు కలిగే స్పందన కావొచ్చు

గుర్తించే వారెవ్వరూ లేనప్పుడు నే పలికే రాగం కావొచ్చు


Rate this content
Log in

Similar telugu poem from Abstract