వరండా
వరండా
పడక్కుర్చీలో తాతగారు
పక్కనే ఏదో అంటున్న బామ్మగారు
సరుకులు తీసుకొచ్చిన నాన్న
వాటిని సర్దుతున్న అమ్మ
ఓ పక్కన మట్టి బొమ్మలు
బొమ్మల్లాంటి పిల్లలు
ఆరుబయటే అందరికీ దోసెలు
కొబ్బరి చెట్ల నీడలు
పక్క వీధి కబుర్లు
పండగప్పుడు పట్టనంత బంధువులు
కొన్ని పట్టింపులు మరెన్నో వడ్డింపులు
కుటుంబం కలిసి చేసే విందులు
ఉస్సూరుమంటూ వచ్చిన వేడిగాలి
వరండాను పాత జ్ఞాపకాల నుండి బయటకు తెచ్చింది.