విశ్రాంతి
విశ్రాంతి
అంతులేని అనుమానాలు
నాలో రేగే అలజడులు
నీపైన పడాలనే కోరికలు
వీటి నుంచి కాసింత విశ్రాంతి కావాలి
రోడ్డు మీద కోర చూపులు
డాబా మీద ఓర చూపులు
మార్కెట్లో విసుగు చూపులు
వీటి నుంచి కూడా విశ్రాంతి కావాలి
కాటుక కళ్ళ కరుకు చూపులు
స్నానాల గది మీది చూపులు
బీచ్ దగ్గరి చూపులు
వీటి నుంచి ఖచ్చితంగా విశ్రాంతి కావాలి
ఈ చూపులూ వాటిలోని అనుమానాలు
అసలు చూపులే అనుమానంగా చూస్తారా
ఏమోనబ్బా
కొంటె చూపులు తగలట్లేదు
సినిమాల్లో చూపించినట్టు వీపుకు మాత్రం అస్సలు గుచ్చుకోవట్లేదు
అందుకే విశ్రాంతి కావాలి.
