విరాగినిలా కాలేక
విరాగినిలా కాలేక
విరాగినిలా కాలేక..
విరహగీతం విరచిస్తున్నా విరిహిణినై
విచిత్రంగా విరిసిన మన ప్రేమ
విడ్డూరంగా విరిగిపడిన పిడుగలా
విగతజీవిగా మారిపోయింది..
విదురనీతి నేర్చుకోలేదు నేను
వింతలన్నీ తట్టుకోవడానికి
వీసమెత్తు ప్రేమ మిగలలేదని
వింద్యాచల వీధుల్లో తిరగలేను మరి
విన్నవించి వైరాగ్యం వాగులో వాలిపోవడానికి..
విసిగిపోయిన విధి నాటకంలో విపరీతాలన్నీ వచ్చి
విసిరిన విచిత్రమైన బ్రతుకు విభేదాలు వైవిధ్యంగా విభజించి విప్పి చెప్పలేని వాక్యాలన్నీ వరుస కట్టి
విరహగీతం విరిసింది ఈ వేళ విరహంలో
విరాగినిలా కాలేక..
