విప్లవ అమర జ్యోతి భగత్ సింగ్
విప్లవ అమర జ్యోతి భగత్ సింగ్


సర్దార్ భగత్ సింగ్ జయంతి
అతడు నిర్భయానికి
నిలువెత్తు సాక్షి
అరాచక ఆంగ్లేయుల
చీకటి పాలనను పారద్రోలడానికి
తన చుట్టూ నిప్పును
వెలిగించుకొని తానే చమురై
విప్లవ జ్యోతిని నలుదిశలా తిప్పి
బ్రిటీష్ మూకలకు
ముప్పుతిప్పలు పెట్టిన
అమరజ్యోతి 'సర్ధార్ అరుణోదయం'
పిన్న వయస్సులో....
పెద్దల దుర్నీతిని పార్లమెంటు బల్లలపై
కుండ బద్దలు కొట్టినట్లు కొట్టి
మితవాద నిండు సభకు
మన నిరసన "బాంబులు" విసిరిన
ధీశాలి... విప్లవ'వాలి'
భారతావని నుదుటన వీర తిలకం
ప్రాణం క్షణికమని
చావు ఎప్పటికైనా అనివార్యమని
ఉన్న కొన్ని దినాలైన
నిజాన్ని నిప్పులా వెలిగించి
పట్టుకొని తిరగాలని
తత్వవేత్తలకూ...ముత్తాతై
ఉరికంబాన్ని ముద్దాడి
నవ్వుతూ అరిపోయి
దేదీప్యమానంగా వెలుగుతున్న
ఆరని అభ్యుదయ జ్యోతి అతడు
అతడు వీరభారత యువతకు 'ఐకాన్'
బాధ్యత మరచి బలాదూర్ గా తిరిగే
నవభారత నల్లులకు పిల్లులకు
తన జీవిత చరిత్రా పిడికిలితో
పిడిగుద్దులు గుద్ది నిలబెట్టి చెవి మెలిపెట్టి
సలాం చేయుంచుకుంటూ
యువతకు అవసరలక్ష్యాన్ని నిర్దేశించి
నిత్య చైతన్యనామ స్మరనీయుడై...
నేటికీ ఆ ఉరితాడులో చిరునవ్వుతో
కనిపిస్తున్న 'గుండె సూది' అతడు