విచిత్రం
విచిత్రం
కయ్యాలమారి కాలం
కత్తిదూస్తుందెందుకో నా మీద
గయ్యాళి గాలి
జగడమాడుతుందెందుకో నాతో
చుట్టూ వెలుగు పూలు పూస్తున్నా
నాలో మాత్రం చీకటి వెంటాడుతున్నది
నిరాశ మేఘాలు నీడలా వెంబడిస్తున్నాయి
అపజయం అవహేళన చేస్తూ వెక్కిరిస్తుంది
ఓదార్పు నివ్వాల్సిన వారే
ఓటమికై వేయి పన్నాగాలు పన్నుతుంటే
సహకరించి సలహాలివ్వమంటే
మిటకరించి మింగేసేలా చూడటం భావ్యమా
మూడు ముళ్ళు ఏడడుగులు అంటూ
పాతచింత పచ్చడిలా వేలాడటం వ్యర్థం కదా
నాకంటూ ఓ లక్ష్యం నేనంటూ నా ఉనికి
కోరుకోవడం నేరమా ఘోరమా
ఎన్నాళ్ళు .. ఎన్నేళ్ళు..
ఈ బంధాల బంధనాలను భరించేది
ఈ బాదర బంధీల నుండి బయట పడేది
మారదేమో కాలం అనుకున్నా
మారాలి మనమేనని తెలుసుకున్నా
ఎంత విచిత్రం
వినడానికే విడ్డూరం
