వేదన
వేదన


కోల్పోవడానికి ఏముందని నేను భయపడాలి
నా ఉనికిని నీకోసం కోల్పోయాక
ఎవరో ఏదో అన్నారని నేనెందుకు బాధపడాలి
నువ్వే నన్ను అన్నేసి మాటలు అన్నాక
అవమానాలకు నేనెందుకు తలొగ్గాలి
నువ్వే నన్ను అన్ని రకాలుగా అవమానించాక
స్నేహమా
నేను నిన్నెందుకు నమ్మాలి
నమ్మక ద్రోహంతో నా మనసు తూట్లు పడ్డాక
జీవిత కాలపు వేదనను బహుమతిగా ఇచ్చాక