STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

వాస్తు దోషమో లేక..

వాస్తు దోషమో లేక..

1 min
377

వలపు రాగాల పల్లకి ఎక్కి

వాకిట నిలిచిన జవ్వనికి

ఆహ్వానం అందించింది చూడచక్కని భవనం


వసంతం వేడుక చేసినట్టు

అద్దాలకు అసూయ పుట్టేట్టు

అందమైన ఆ గృహం ఆనందం నింపుకుంది


తొలి రేయి మలి రేయి ఆపై మూడవ రేయి

ప్రణయ క్రీడల జ్వలించిన తనువులను 

వేకువ గాలి సేదదీర్చినది


అంత బాగా నచ్చిన ఇల్లు

అందరూ మెచ్చిన వాకిళ్ల ఇల్లు

ఆమెకిక నచ్చలేదు


వాస్తు దోషమనో

లేక వయసు దోషమనో

ఆమె చెప్పలేదు

మరెప్పుడూ ఆ ఇంట వసించనూ లేదు


Rate this content
Log in

Similar telugu poem from Abstract