STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Tragedy Inspirational Others

4  

స్వాతి సూర్యదేవర

Tragedy Inspirational Others

వాడిన మన(షు)సులు

వాడిన మన(షు)సులు

1 min
312

కనురెప్పల మాటున కన్నీటి సంద్రాన్ని దాచి కవ్వించడం నేర్చాము...

గుండెలోపల బద్దలయ్యే లావాని అణిచి అందాలని మాత్రమే చూపడం మొదలెట్టాము...

నా ఆకలి తీర్చుకోవడానికి ఒకరి ఆకలికి వడ్డించిన విస్తర లా మారి చివరికి ఎంగిలాకులా మిగిలాము....

కొందరు కామాంధులకి బొమ్మ గా,మరి కొందరికి వాడే వస్తువులా మారిపోయాము.....

అందం శాపమై ఒకరం,నా అన్న వాళ్ళ కష్టాలు తీర్చడానికి మరొకరం ,మోసపోయి ఒకరం,అఘాయిత్యానికి భలయ్యి ఒకరం కారణం ఏమైతేనేం ...

చివరకు సమాజంలో గౌరవం లేని, వ్యక్తిత్వం లేని ,జీవం ఉన్న  ఆటబొమ్మలమై చివరకు వేశ్యలా మిగిలిపోయాము...


Rate this content
Log in

Similar telugu poem from Tragedy